చిన్నారుల మితిమీరిన అల్లరికి ఎలా అడ్డుకట్ట వేయాలి?

Webdunia
బుధవారం, 20 జనవరి 2016 (12:32 IST)
చిన్న పిల్లలు ఇంట్లో ఆట్లాడుతూ అల్లరి చేస్తుంటే ఎంతో అందం, ఆనందంగా ఉంటుంది. పిల్లలు చేసే అల్లరిని కంట్రోల్‌ చేయటం తల్లిదండ్రులకు కష్టమే. అలాగని ఏమీ పట్టించుకోకుంటే అల్లరి మితిమీరిపోయే ప్రమాదము లేకపోలేదు. అలాంటి పిల్లల వల్ల తల్లిదండ్రులకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే పిల్లల మితిమీరిన అల్లరిని అదుపులో ఉంచడం ఎంతో మంచిది. 
 
కొందరు పిల్లలు ఎదుటి పిల్లల దగ్గర్నుంచి ఆటవస్తువుల్ని లాగేయటం చేస్తుంటే మా పిల్లలు గొప్పవారు అన్నట్లుగా తల్లిదండ్రులు ఫీలవుతుంటారు. ఇలాచేయటం వల్ల పిల్లలు వారు చేసే పని కరెక్టు అనుకుంటారు. దీని వల్ల ఎదుటి పిల్లల చేతుల్లోని ఆటబొమ్మల్ని సులువుగా లాగేస్తారు. అందుకే తీసుకున్న వస్తువును తిరిగిచ్చే పద్ధతిని నేర్పించాలి.
 
సాధారణంగా పిల్లలు తమ తోటి పిల్లలతో ఆడుకుంటూ మధ్యలో వారిని కొడుతుంటారు. ఇలా ఇతరులను కొట్టడం మంచిది కాదని తల్లిదండ్రులు పిల్లలకి తెలియజెప్పాలి. అయినా అలాగే పిల్లలు ఇతరులతో పోట్లాడుతుంటే తల్లిదండ్రులు మంచిచెడుల గురించి వివరించి చెప్పాలి. ఇలా ప్రవర్తించటం వల్ల స్నేహితులు దూరం అవుతారని వాళ్లకు అర్థమయ్యేలా విడమరిచి చెప్పాలి. దీనివల్ల పిల్లలు తాము చేసిన పొరబాటును సులభంగా తెలుసుకోగలుగుతారు. పిల్లలు పొరపాటున గొడవ పడితే ఏమాత్రం ఆలోచించకుండా కొందరు తమ పిల్లల్నికోపంగా చెంప దెబ్బలు కొడతారు. దీనివల్ల చిన్నారుల చిట్టి మనసు గాయపడుతుంది.
 
పిల్లల్ని షాపింగ్‌కు తీసుకెళ్తే అవి కావాలి.. ఇవి కావాలి అని మారాం చేస్తుంటారు. వారికి ఇష్టమైనవి కొనివ్వడం వల్ల తల్లిదండ్రులకు సంతోషాన్నిస్తుంది. అయితే, ఇది ఓ రకంగా చెడు అలవాటే. పిల్లలకు ఇష్టమైన ప్రతి వస్తువును కొనిస్తూ పోతే... నేను ఏమి అడిగినా పేరెంట్స్‌ కాదనరు అనే భావన వారిలో ఏర్పడుతుంది. ఉన్నట్టుండి పిల్లలు అడిగిన వస్తువును కొనడానికి తల్లిదండ్రులు తిరస్కరిస్తే మారాం చేస్తారు. నలుగురిలో ఇబ్బంది కలిగిస్తారు. 
 
ఎందుకు కొనివ్వరు అంటూ నానా హంగామా చేస్తారు. ఏడుపు, మొండితనంతో విసిగిస్తారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇతరుల ముందు ఇబ్బంది పడతారు. అందుకే మొదట్లోనే పిల్లలకు ఏది కావాలంటే అది కొని ఇచ్చే సంప్రదాయాన్ని మానుకోవాలి. అవసరమైనమేరకు మాత్రమే కొనివ్వండి. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలు.. సూచనలు పాటించినట్టయితే చిన్నారుల అల్లరిని కొంతమేరకు కంట్రోల్ చేయవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మోనాలిసా మొగుడుపై పోక్సో కేసు, 16 ఏళ్ల బాలికను ఎలా పెళ్లాడావు?

పెళ్లి రద్దు చేసుకుందని హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించాడు.. యువతి బలవన్మరణం

అలా చేయడం హిందూ మతానికే మంచిది కాదు : సుప్రీంకోర్టు

సొంత ఇల్లు - భూమి లేదు : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. 50కిలో మీటర్లు సైకిల్ తొక్కుతూ..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranveer Singh: అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలో రణవీర్ సింగ్ కు అభిమానం వెల్లువెత్తింది

కన్నడ చిత్రం రాక్షసపురం కు కె.ఎస్. రామారావు సపోర్ట్

Raghu Kunche: రఘుకుంచె గేదెలరాజు రిలీజ్ డేట్ మారింది

Niharika: ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటా : నిహారిక కొణిదెల

Arya: ఆర్యా, పోలూరు కృష్ణ కాంబినేషన్ టైటిల్ రంజీ

Show comments