పిల్లలు చెప్పకుండానే హోంవర్క్ చేయాలంటే?

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (17:02 IST)
పాఠశాల వచ్చి రాగానే పుస్తకాలు ముందేసుకుని కూర్చుని హోం వర్క్ చేయమనడం సరికాదు. రాగానే పిల్లల స్కూలు విశేషాలను అడిగి తెలుసుకుంటూ ముందు వారికి శక్తినిచ్చే ఆహారాన్ని అందివ్వండి. ఎందుకుంటే మధ్యాహ్నం తిన్న ఆహారం ఇంటికొచ్చేటప్పటికీ అరిగిపోయి ఉంటుంది. దాంతో వాళ్లలో నిస్సత్తువ చేరి క్షణం కూడా చదువుపై దృష్టి కేంద్రీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. 
 
అలాంటప్పుడు చిన్నారుల దినచర్యను ఏ వారానికి ఆ వారం మీరే నిర్ణయించి ఓ ప్రణాళిక సిద్ధం చేసి, ఛార్ట్‌పై గీసి గోడకు అతికించండి. అలాగనీ ప్రతీది యాంత్రికం చేయకూడదు. పిల్లలు ఏ సమయంలో ఏం చేయాలనుకుంటున్నారో కనుక్కొని ఆ సమయంలో చెప్పకుండానే హోం వర్క్ పూర్తి చేసేలా ప్రోత్సహించండి. అది అలవాటయ్యేలా చూడండి. 
 
హోం వర్క్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అర్థం కాకుంటే చెప్పండి. కుదరకపోతే ట్యూషన్ పెట్టించాలి. టీవీ చూడడం, ఆటలాడటాన్ని కూడా ప్రోత్సహించాలి. వీటి కోసమూ సమయం కేటాయిస్తూనే.. హోం వర్క్‌కి ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా చెప్పాలి. 
 
బాగా చదవాలన్న ఉద్దేశంతో తరచూ పిల్లల్ని ముందేసుకుని కూర్చోమనడం సరికాదు. కాసేపు చదివినా దాన్ని ఒంటపట్టించుకుంటున్నారో లేదో గమనించుకోవాలి. ఏకాగ్రతతో చదివేలా సూచనలు చేయాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ కూడా అమెరికాకు ముప్పుగా మారుతుంది: అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్

Vijay: 50శాతం సీట్లు, 2.5ఏళ్ల సీఎం పోస్టు: నో చెప్పిన విజయ్.. త్రిషతో చర్చలు?

నేను ఆమెకు బినామీని కాదు.. సరస్వతి పవర్ షేర్లన్నీ షర్మిలకే చేరాలి.. విజయమ్మ

Kerala: కేరళలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ఇక కాస్కోండి... మా దెబ్బ రుచిచూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

Show comments