Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృదేవో భవ... నాన్నకు ప్రేమతో హ్యాపీ ఫాదర్స్ డే..! నాన్న కష్టాన్ని గుర్తించాలి గురూ..!

మాతృదేవో భవ, పితృదేవో భవ అనే సూక్తిని అందరికీ గుర్తుండే వుండాలి. జన్మనిచ్చిన అమ్మకు తర్వాత తండ్రికే ప్రాధాన్యం ఇవ్వడం ఈ సూక్తిని బట్టే అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు అనేవారు ఈ లోకంలో తమ పిల్లలకు మార

Webdunia
ఆదివారం, 19 జూన్ 2016 (13:40 IST)
మాతృదేవో భవ, పితృదేవో భవ అనే సూక్తిని అందరికీ గుర్తుండే వుండాలి. జన్మనిచ్చిన అమ్మకు తర్వాత తండ్రికే ప్రాధాన్యం ఇవ్వడం ఈ సూక్తిని బట్టే అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు అనేవారు ఈ లోకంలో తమ పిల్లలకు మార్గదర్శకంగా ఉంటారు. అలా పుట్టిన బిడ్డకు అంతా తానై వుండే తండ్రికి కృతజ్ఞతలు తెలిపే పండగే ఫాదర్స్ డే.. పితృదినోత్సం. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో నాన్నల గౌరవార్థం జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని "పితృ దినోత్సవం (ఫాదర్స్ డే)"గా పాటిస్తున్నారు. 
 
మాతృత్వానికే కాక పితృత్వానికి కూడా విలువనిస్తూ ఈ రోజును అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఆధునికత పేరుతో పాటు మహిళలు సైతం పురుషులకు సమానంగా ఉద్యోగాలకు వెళ్తున్న తరుణంలో కుటుంబ బాధ్యతలతో పాటు పిల్లల పెంపకం, ఇంటి పనుల్ని కూడా ప్రస్తుత పురుషులు సమానంగా పంచుకుంటున్నారు. పిల్లల ఆలనా పాలనా చూసుకోవడంలో తండ్రులే ప్రస్తుతం ముందుంటున్నారు. అలాంటి తండ్రుల గౌరవార్థం జరుపుకునే ఈ పండుగ సందర్భంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపేద్దాం.. ఇంకా ఈ పండుగను గురించి కొంచెం తెలుసుకుందాం... 
 
ఫాదర్స్ డే జరుపుకోవాలనే సంప్రదాయం మనదేశానికి కొత్తదే. పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఈ పండుగ..‌ మన భారతీయుల్లో ఉన్న సహజ సెంటిమెంట్ దృష్ట్యా విశేషణ ఆదరణను పొందింది. 1972లో జూన్ మూడో ఆదివారం ఫాదర్స్‌డే నిర్వహించడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనాటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్‌ డేను జరుపుకుంటున్నారు.
 
ఇంకా పితృదినోత్సవం జరుపుకోవాలని తొలిసారిగా గుర్తించింది.. వాషింగ్టన్‌లోని స్పోకనే‌కు చెందిన లవింగ్ డాటర్ సొనారా. తండ్రులందరి గౌరవార్ధం అధికారికంగా ఓ రోజును కేటాయించాలని ఆమె ఎంతగానో పోరాడి, ఫాదర్స్ డే పండుగను వెలుగుచూసేలా చేసింది. తండ్రి కష్టాన్ని గుర్తించి ఆయనకే కాదు.. తండ్రులందరికీ ఓ రోజు ఉండాలని పట్టుబట్టి ఈ రోజును వెలుగులోకి తెచ్చింది. 
 
ఆధునికత కారణంగా మహిళలకు సమానంగా పిల్లల పెంపకంతో పాటు అన్నీ పనుల్ని అంటే.. పిల్లలకు డైపర్లు మార్చడం, పాలు పట్టడం, ఆడించడం లాంటి పనులన్నీ కూడా మగాళ్లే చేస్తున్నారు. వారిని స్నానం చేయించడం. స్కూల్ కి రెడీ చేసి స్కూలుకి తీసుకెళ్ళడం. వారి హోం వర్క్ చేయించడం వారికి అన్నం తినిపించడం కూడా నేటి తండ్రులు బాగానే చేస్తున్నారు. 
 
వర్కింగ్ డేస్‌లో నగరంలో ఉండే తల్లిదండ్రుల్లో ఫాదర్సే పిల్లలతో ఎక్కువగా గడుపుతున్నారని పలు సర్వేలు తేల్చాయి. పూర్వం పిల్లలు అమ్మతో ఉన్నంత చనువుగా నాన్నతో ఉండే వారు కాదు నాన్నంటే భయభక్తులు ఉండేవి. ప్రస్తుతం నాన్నే పిల్లలకు మంచి ఫ్రెండ్, మార్గదర్శిగా మారిపోయాడు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా తండ్రితోనే చాలా చనువుగా ఉంటున్నారని సర్వేల్లో వెల్లడయ్యాయి. 
 
కానీ నేటి యువత నాన్న కష్టాన్ని గుర్తించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. తనకు బాబు పుట్టాడు లేదా పాప పుట్టిందని పొంగిపోయే తండ్రికి ఆ బిడ్డ పెరిగిన తర్వాత నాన్న కష్టాన్ని గుర్తించకపోతే.. ఫలితం శూన్యమని అంటున్నారు. నాన్నంటే అడిగిందల్లా కొనిచ్చే యంత్రం కాదని.. ఆయన మనోభావాలను గుర్తించే బాధ్యత తమపై ఉందని నేటి యువత తప్పకుండా గుర్తించాలి. నాన్నకు పిల్లలు సముచిత గౌరవం ఇవ్వాలి. 
 
చదువు, ఉద్యోగం, వివాహంలో పిల్లల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే తండ్రి మనస్సును నొప్పించకుండా.. ప్రవర్తించాల్సిన బాధ్యత పిల్లలపై ఉందనేది గుర్తించాలి. అయితే, నేటి నాగరికత ముసుగులో రెక్కలొచ్చిన పిల్లలు అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేస్తున్న ఉదంతాలు లేకపోలేదు. ప్రేమలు, పెళ్లిళ్ల విషయాల్లో అమ్మానాన్నల మనోభావాలనూ గౌరవించాలి. 
 
సరైన ఆలోచనలు లేకుండా ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుకోకుండా తల్లిదండ్రుల అభిప్రాయాలను గుర్తించాలి. ఇరవై ఏళ్లు పెంచి పోషించిన నాన్నను- ప్రేమ కోసమో, పెళ్లి కోసమో విస్మరించడం, విభేదించడం నేటి యువతలో సాధారణమైపోయింది. మంచి ఉద్యోగం సంపాదించాక తల్లిదండ్రుల యోగక్షేమాలను కొంతమంది పట్టించుకోనందునే నేడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి.
 
ఉద్యోగాల పేరిట ఇతర ప్రాంతాలకో, విదేశాలకో వెళ్లిపోయి అమ్మానాన్నలను విస్మరించడమంటే- పిల్లలు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లే. అమ్మానాన్నలపై నిర్లక్ష్యం వహిస్తే, భవిష్యత్‌లో తమకూ ఇలాంటి పరిస్థితే తప్పదని పిల్లలు గుర్తించాలి. ఫాదర్స్ డే అంటూ ఏడాదికోసారి హడావుడి చేయడం, గొప్ప కోసం బహుమతులు కొనడం కాదు. తమకు జన్మనిచ్చిన నాన్నను ఏడాది పొడవునా గుర్తుంచుకోవాలి. 
 
ఆయన మనసెరిగి బాధ్యతగా ప్రవర్తించడం పిల్లల కనీస కర్తవ్యం అనేది గమనించాలి. కానీ నేటి యువత తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుని ప్రేమ పెళ్ళిళ్ళు వారి వారి అనుమతితో జరిపించుకోవడం.. వారిని అనుగుణంగా నడుచుకోవడం కూడా చేస్తున్నారని సర్వేలు తేల్చాయి. అందుకే పారిపోయి పెళ్ళి చేసుకోవడం చాలామటుకు తగ్గిపోయాయంటున్నారు మానసిక నిపుణులు. ఏది ఏమైనా లోకంలో తమకంటూ ఓ గుర్తింపు ఇచ్చిన తండ్రికి గౌరవార్థం జరుపుకునే ఈ పండుగ రోజున అందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

Jagan Birthday: జగన్‌కు నాగబాబు, చంద్రబాబుల పుట్టినరోజు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

తర్వాతి కథనం
Show comments