స్కూల్లో చేర్పించే ముందు ఏం చేయాలంటే?

Webdunia
గురువారం, 8 జనవరి 2015 (17:36 IST)
ఉద్యోగం కావచ్చు. మరో కారణం వల్ల కావచ్చు. పిల్లల్ని సంరక్షణ కేంద్రంలో దింపాలనుకుంటున్నారా? అంతకన్నా ముందు ఈ అంశాలపై దృష్టి పెట్టండి. మీరు అక్కడికి వెళ్లి పరిస్థితుల్ని సొంతంగా చూడకుండా పిల్లల్ని చేర్పించే ప్రయత్నం చేయొద్దు. 
 
ముందు కాస్త అధ్యయనం చేయండి. మీ స్నేహితులూ, సహోద్యోగులూ, బంధువుల సాయం తీసుకోండి. అప్పుడు వాళ్లు తమ పిల్లల్ని ఉంచిన కేర్ సెంటర్‌లో ఉన్న సమస్యలూ, సౌకర్యాలను తెలియజేస్తారు. వాటి గురించి తెలుసుకున్న తర్వాతే సరైన దాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. 
 
* అక్కడికి వెళ్ళాక కూడా నిర్వాహకులతో మాట్లాడి.. మీకు అవసరమైన వివరాలన్నీ అడిగి తెలుసుకోండి. ఈ రోజుల్లో ఉద్యోగం చేసే తల్లులు ఎక్కుడున్నా సంరక్షణ కేంద్రంలో తమ పిల్లలు ఎలా ఉన్నారని తెలుసుకునే అవకాశం ఉంది. అలాంటి సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నదీ గమనించండి. దీనివల్ల చిన్నారుల విషయంలో మీరు చాలా శ్రద్ధ చూపిస్తారని అవతలి వారూ గుర్తిస్తారు. 
 
* కేవలం సంస్థ యజమానే కాదు, అక్కడ పనిచేసే సిబ్బంది కూడా పిల్లలతో ఎలా వ్యవహరిస్తారనేది తెలుసుకోవాలి. చెప్పాలంటే.. వాళ్లూ పిల్లలతో సమానంగా ఆడాలి. అన్ని సమయాల్లో వాళ్ల పక్కనే ఉండి బాగోగులు చూసుకోవాలి. సాధ్యమైనంత సహనం వారిలో కనిపించాలి. 
 
అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నారనేది తెలుసుకోవడం కూడా అవసరమే. పిల్లల్ని ఉంచే గదులూ, భోజన శాల, ఆట స్థలం.. పరిశుభ్రంగా, సౌకర్యంగా ఉన్నాయా లేవా అన్నదీ గమనించాలి. లేదంటే పిల్లల్ని చేర్పించాక అనారోగ్య సమస్యలు మొదలవ్వొచ్చు. సంరక్షణ కేంద్రం వాళ్లకు నచ్చకపోవచ్చు.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్యార్థినికి గర్భం చేసి అబార్షన్ చేయించిన ఉపాధ్యాయుడు.. ఎక్కడ?

మా తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారు : మంత్రి నాదెండ్ల మనోహర్

అమెరికాతో చర్చల విఫలం కావడానికి కారణం ఇదే : ఇరాన్

వచ్చే పుట్టినరోజు వచ్చే లోగా లేపేస్తాం ... జనసేన పార్టీ నేతకు వైకాపా హెచ్చరిక

ఇస్లామాబాద్ టాక్స్ : అమెరికా - ఇరాన్ శాంతి చర్చలు విఫలం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి, రూ. 600 ఆసుపత్రి బిల్లు కట్టలేక అక్కడే మృతదేహం

Allari Naresh: నాకంటే నా వైఫ్ ఆయనకు ఫ్యాన్ : అల్లరి నరేష్

Mangli case: మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - వేణు ఊడుగుల

Show comments