Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయసు రెండేళ్లే.. అయితేనేం, ఇతనో బాల "ఐన్‌స్టీన్"

Webdunia
FILE
బ్రిటన్‌కు చెందిన జోయే, హన్నా రిగ్లీల ముద్దుల పట్టీ.. ఆస్కార్ రిగ్లీకి ఇంకా స్కూలుకెళ్లే వయసు కూడా రాలేదు. అయితేనేం.. ఈ బుడతడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తెలివితేటలతో సమానంగా పోటీపడగలడు. రెండేళ్ల ఐదు నెలల వయసున్న ఈ చిన్నారి అత్యధిక ఐక్యూ (ఇంటెలిజెన్స్ క్వైటెంట్) కలిగిన సమాజం "మెన్సా"లో కూడా సభ్యత్వం సాధించాడు.

తోటి పిల్లలతో ఎంచక్కా ఆటలాడుకోవాల్సిన వయసులో వన్యప్రాణులు, సంగీతం గురించి ఆలోచిస్తున్న ఈ బాలుడు.. ఆటబొమ్మల స్థానంలో ఏకంగా శాక్సాఫోన్‌నే కొనివ్వమంటున్నాడు. ఇలా వయసుకు మించిన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న ఈ బాలుడి ఐక్యూ ఎంతో కనుక్కుందామని తల్లిదండ్రులు పరీక్షలు చేయించారు.

45 నిమిషాలపాటు జరిగిన స్టాన్‌ఫోర్డ్ బెనెట్ పరీక్షలో ఆస్కార్ ఐక్యూ 160 గా నిర్ధారణ అయ్యింది. అయితే ఇంతకంటే ఎక్కువ ఐక్యూను కొలిచే సామర్థ్యం ఆ పరీక్షకు లేకపోవటంతో.. ఈ బుడతడి ఐక్యూ ఎంతో ఇప్పటిదాకా నిర్ధారణ కాకపోవటం గమనార్హం. అయితే రెండేళ్ల ఐదు నెలల వయస్సుకే ఇతగాడు ఏకంగా ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లకు ఉన్నంత ఐక్యూను సొంత చేసుకోవడం విశేషంగా చెప్పవచ్చు.

ఆస్కార్ ఐక్యూను పరీక్షించిన వైద్యుడు పీటర్ కాంగ్‌డాన్ మాట్లాడుతూ.. లక్షమంది పిల్లల్లో ఒకరు మాత్రమే ఇలా ఉంటారని తేల్చి చెప్పారు. ముందు ముందు జరిపే పరీక్షల్లో అతడి ఐక్యూ ఎంతో సరిగా నిర్ధారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న వేస్తూనే ఉండే ఈ చిచ్చరపిడుగు.. ప్రస్తుతం పెంగ్విన్ ప్రత్యుత్పత్తి వ్యవస్థను తల్లికి వివరించేస్తున్నాడట.

ఇక ఆస్కార్ ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు సైతం అతగాడి జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోతున్నారట. పుట్టిన నాలుగు నెలలకే తనకు ఇష్టమైన బట్టలను ఎంపిక చేసుకున్న ఈ గడుగ్గాయి.. 9 నెలలకే వసపిట్టలా మాట్లాడేశాడని తల్లి చెబుతోంది. 18 నెలలకే ఇంగ్లీష్ అక్షరమాలను బట్టీపట్టేసి, రెండేళ్లకే వేలాది పదాలను నేర్చుకున్నాడని ఆమె వివరించింది. సాధారణంగా అయితే ఈ వయసులో 50 పదాలను పలకడం కూడా గగనమే. మరి ఈ చిన్నారి ఏకంగా వేల పదాలను అవలీలగా చెప్పేస్తున్నాడు.

అసలు ఈ చిచ్చరపిడుగుకు ఇంత చిన్న వయస్సులోనే అంతగా ఐక్యూ ఎలా వచ్చిందని పరిశీలిస్తే.. తన తల్లి వంశవృక్షంలోని జన్యువుల వల్లనేనని తేలిందని ఆస్కార్ తల్లి వివరించింది. 1995వ సంవత్సరంలో ఇతగాడి మేనమాన ఒకరు పదమూడేళ్లప్రాయంలోనే డిగ్రీ విద్యను ఆరంభించారట. అయితే ఇంత చిన్న వయసులోనే చిచ్చరపిడుగులా తయారైన ఆస్కార్‌ను పాఠశాలలో చేర్పించేందుకు బాగా తంటాలు పడాల్సి వచ్చిందని ఆమె వాపోయారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

Show comments