జియో దెబ్బకు 75 వేల కొలువులు కొండెక్కాయి

దేశీయ టెలికాం సునామీ రిలయన్స్ జియో దెబ్బకు దేశవ్యాప్తంగా 75 వేల కొలువులు కొండెక్కాయి. ఈ కొలువుల్లో పని చేసే ఉద్యోగుల భవిత అంధకారంలోకి కూరుకుంది. గత యేడాది టెలికాం సేవలను ప్రారంభించిన జియో... భారీ ఆఫర్

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (10:29 IST)
దేశీయ టెలికాం సునామీ రిలయన్స్ జియో దెబ్బకు దేశవ్యాప్తంగా 75 వేల కొలువులు కొండెక్కాయి. ఈ కొలువుల్లో పని చేసే ఉద్యోగుల భవిత అంధకారంలోకి కూరుకుంది. గత యేడాది టెలికాం సేవలను ప్రారంభించిన జియో... భారీ ఆఫర్లతో కస్టమర్లను అమితంగా ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, జియో దెబ్బకు ఇతర నెట్‌వర్క్‌లన్నీ కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నెట్‌వర్క్‌ల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్తోంది. జియో దెబ్బతో యేడాది కాలంలోనే టెలికాం పరిశ్రమలో పనిచేస్తున్న 75 వేల మంది ఉద్యోగాలు పోయాయి. భారత టెలికాం పరిశ్రమలో రిలయన్స్‌ జియో సంచలనాలకు నాంది పలికింది. 
 
ఉచిత సేవలతో ప్రత్యర్థి కంపెనీలకు దడపుట్టించించిన జియో.. ఇప్పుడు మరో విధ్వంసానికి కూడా కారణమైంది. జియో సృష్టిస్తున్న ప్రకంపనలకు టెలికాం రంగంలో వేలాది కొలువులు ఊడుతున్నాయి. జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో ఏడాది కాలంలో దాదాపు 75 వేల కొలువులు కొండెక్కాయి. 
 
గత యేడాది సెప్టెంబర్‌లో జియో పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలను మొదలు పెట్టేనాటికి ఈ రంగంలో మొత్తంగా 3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు అంచనా. యేడాది తిరిగే సరికే ఇందులో దాదాపు 75 వేల మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయారు. ఇందులో 30 శాతం మంది మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం వారే కావడం గమనార్హం. టెలికాం రంగంలో దాదాపు 50 శాతం మంది ఈ విభాగంలోనే పనిచేస్తారు.
 
టెలికాం రంగంలోని సంస్థలన్నీ ఆస్తులు విక్రయిస్తుండటంతో యేడాది కాలంగా ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఆగిపోయింది. కంపెనీ మొత్తం ఖర్చులో మానవవనరులకు దాదాపు 4 నుంచి 5 శాతమే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం దాన్ని కూడా భరించే స్థితిలో కూడా కంపెనీలు లేకపోవడంతో మొదటి వేటు ఉద్యోగులపైనే పడుతోంది. దీంతో ఈ రంగంలో పనిచేస్తున్న ఇంకా చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
 
కాగా, జియో రాకతో కంపెనీల రాబడి, లాభాలు, నగదు రాక ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఈ దెబ్బతో రెండు, మూడు స్థానంలో ఉన్న వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ విలీన ప్రక్రియలో ఉన్నాయి. టాటా టెలీ సర్వీసెస్‌ వైర్‌లెస్‌ వ్యాపారం కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్‌ సూచనలు చేసింది. ఇప్పటికే ఐడియా, వొడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ తమ టవర్ల సంస్థలను విక్రయానికి పెట్టాయి. మొత్తంగా జియో ఎఫెక్ట్‌ ఉద్యోగుల జీవితాలనూ ఛిన్నాభిన్నం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments