Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లోనూ గూగుల్ వాయిస్ సెర్చ్ సేవలు

సెర్చ్ ఇంజిన్ గూగుల్ నెటిజన్లకు మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది. గూగుల్ వాయిస్ సెర్చ్‌ను ఇకపై ప్రాంతీయ భాషల్లో ఇవ్వనుంది. ఈ సేవను 30 ప్రాంతీయ భాషల్లో అభివృద్ధి చేయనుంది. తద్వారా వాయిస్ ఆదేశాల ద్వారా గూగుల్‌ను

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (17:53 IST)
సెర్చ్ ఇంజిన్ గూగుల్ నెటిజన్లకు మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది. గూగుల్ వాయిస్ సెర్చ్‌ను ఇకపై ప్రాంతీయ భాషల్లో ఇవ్వనుంది. ఈ సేవను 30 ప్రాంతీయ భాషల్లో అభివృద్ధి చేయనుంది. తద్వారా వాయిస్ ఆదేశాల ద్వారా గూగుల్‌ను ఆపరేట్ చేయడం మరింత సులభతరం అవుతుంది.

ఈ భాషలు ఆండ్రాయిడ్ ఫోన్లలోని గూగుల్‌ యాప్‌తో పాటు జీబోర్డు యాప్‌ల్లోనూ పనిచేస్తాయని, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వంటి దక్షిణాది భాషలతో పాటు బెంగాలీ, గుజరాతీ. మరాఠీ, ఉర్దూ వంటి ఉత్తరాది భాషల్లోనూ ఈ వాయిస్ సెర్చ్ అందుబాటులో వుంటుంది.
 
ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషల వరకే పరిమితమైన గూగుల్ వాయిస్ సెర్చ్ సేవలను మరో 30 భాషల్లో అందించేందుకు గూగుల్ సెర్చ్ సిద్ధమవుతోంది. ఈ సేవ‌ను ఉప‌యోగించుకోవాలంటే సెట్టింగ్స్‌లో వాయిస్ మెనూలో త‌మ ప్రాంతీయ భాష‌కు ఆప్ష‌న్ మార్చుకోవాలి.

ఈ సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వారికి సౌకర్యంగా వుంటుందని.. తద్వారా స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments