Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుకెర్‌బర్గ్ ఇచ్చిన మాట తప్పి మోసం చేశాడు : కేసు పెట్టిన బిల్డర్

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (11:31 IST)
ఫేస్‌బుక్ సీఈఓ పీటర్ జుకెర్‌బర్గ్‌పై అమెరికాకు చెందిన ఓ బిల్డర్ మోసం కేసు పెట్టాడు. గత 2012లో తనకు మాట ఇచ్చి మోసం చేశాడంటూ అందులో పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా జుకెర్‌బర్గ్ పంపిన ఈమెయిల్స్‌ను చూపించాడు. దీంతో న్యాయమూర్తి కేసు విచారణకు స్వీకరించి కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు.
 
అమెరికాకు చెందిన మిర్సియా ఓస్పెర్సియన్‌ అనే బిల్డర్‌ శాన్‌జోస్‌లోని కోర్టులో జుకెర్‌బర్గ్‌పై ఓ మోసం కేసు పెట్టాడు. తన బెడ్‌రూమ్‌ ఎదురుగా ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించకుండా ఉంటే, సిలికాన్‌ పెద్దలను పరిచయం చేసి నీ వ్యాపారం పెరిగేలా చేస్తానని 2012లో జుకర్‌బర్గ్‌ నోటి మాట ద్వారా హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదన్నది ఆ బిల్డర్ ప్రధాన ఆరోపణ. 
 
దీనిపై జుకెర్‌బర్గ్ మాత్రం తనకేపాపం తెలియదంటూ వాపోతున్నాడు. కేసు కొట్టివేయండని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఓస్పెర్సియన్‌ మాత్రం నా ఆరోపణలకు అప్పట్లో జుకర్‌బెర్గ్‌ పంపిన ఇ-మెయిల్‌ సాక్షాలు కోర్టుకు చూపడంతో కేసు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments