Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్స్ యా‌ప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా... బాధ‌ ప‌డ‌కండి... ఇలా చేయండి

విజ‌య‌వాడ ‌: మిమ్మ‌ల్ని ఎవ‌రైనా వాట్సాప్‌లో బ్లాక్ చేశారా... బాధ‌ప‌డ‌కండి... ఇలా చేయండి... ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ని కూడా వాడుతుంటారు. సాధారణంగా వాట్సాప్ వాడే వారిలో 15 నుండి 30 సంవత్సరాల లోపు వారు అధిక

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (21:04 IST)
విజ‌య‌వాడ ‌: మిమ్మ‌ల్ని ఎవ‌రైనా వాట్సాప్‌లో బ్లాక్ చేశారా... బాధ‌ప‌డ‌కండి... ఇలా చేయండి... ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ని కూడా వాడుతుంటారు. సాధారణంగా వాట్సాప్ వాడే వారిలో 15 నుండి 30 సంవత్సరాల లోపు వారు అధిక సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే స్కూల్‌లో ఉండగానే స్మార్ట్ ఫోన్‌లు వాడటం అలవాటైపోతుంది. ఇక వీరికి ఫేస్ బుక్, వాట్సాప్, యు ట్యూబ్ లాంటివి లేకపోతే రోజు గడవదు. వీరిలో చాలామంది ఓ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అదే బ్లాక్ చేయడం.
 
సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే అన్ బ్లాక్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆ అధికారం కేవలం బ్లాక్ చేసిన వారికే ఉంటుంది. ఇలా మిమ్మల్ని బ్లాక్ చేసిన వారందరి నుండి వారికి తెలియకుండా అన్‌బ్లాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 
 
* ముందు మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి వారి ప్రొఫైల్‌ను సందర్శించండి.
 
* వారి ప్రొఫైల్ పిక్చర్ మరియు వారి స్టేటస్ కనుక మీకు కనబడకపోతే వారు మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే.
 
* ఇప్పుడు అన్ బ్లాక్ చేసుకోడానికి ముందు మీ వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
 
* ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి.
 
* ఆ తర్వాత ఎకౌంట్స్ సెలెక్ట్ చేయండి.
 
* కింద మీకు డిలీట్ ఎకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నెంబర్ ఎంటర్ చేసి డిలీట్ ఎకౌంట్ పైన క్లిక్ చేయండి.
 
* ఇప్పుడు మీ ఫోన్ లోని సెట్టింగ్స్‌కి వెళ్ళండి.
 
* అక్కడ యాప్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి.
 
* ఇక్కడ నుండి వాట్సాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయండి.
 
* అన్ ఇన్ స్టాల్ అయిన తర్వాత మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి.
 
* ఇప్పుడు కొత్తగా మరోసారి వాట్సాప్‌ను ఇంస్టాల్ చేయండి.
 
* అది అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంతే.
 
* ఇలా చేస్తే చాలు.. మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో వారందరి బ్లాక్డ్ లిస్టు నుండి మీరు తొలగిపోతారు.
ఇక ఆల‌స్యం ఎందుకు ... మీ బ్లాక్‌లు తొల‌గించే ప‌నిలో ఉండండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments