అద్భుతమైన ఫీచర్లతో రెడ్మీ ఫోన్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:36 IST)
యువతను ఆకట్టుకునే అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్‌లను అందిస్తూ భారత స్మార్ట్ ఫోన్ రంగంలో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ షియోమీ. భారత మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది. తాజాగా ఈ సంస్థ నుండి మరో రెండు మోడళ్ల స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి.
 
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో షియోమీ ఎమ్‌డి మనుకుమార్ జైన్ రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో అనే మరో రెండు మోడల్‌లను లాంఛ్ చేసారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్న రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్ ధరను రూ. 13,999గా నిర్ణయించగా, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమరీ కలిగిన మోడల్ ధరను రూ. 16,999గా నిర్ణయించారు. ఇక మరో మోడల్ రెడ్‌మీ నోట్ 7లో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ ఇంటర్నల్ మెమరీ గల మొబైల్ ధర రూ. 9,999 కాగా, 4 జీబీ ర్యామ్ +64 ఇంటర్నల్ మెమరీ గల ఫోన్ ధర రూ. 11,999గా నిర్ణయించారు.
 
ఈ రెండు మోడళ్లు 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి స్క్రీన్‌తో, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అందించబడ్డాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్ ఫోన్‌లో ఇదివరకు ఎన్నడూలేని విధంగా 48 మెగాపిక్సెల్ కలిగిన బ్యాక్ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లను మార్చి 6 నుండి అందుబాటులోకి తెస్తామని మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం.. భద్రత ఎక్కడ ఉన్నాయి? (video)

Samantha: మహిళా సూపర్ స్టార్లు రావాలంటే నిర్మాతలు ముందుకు రావాలి : సమంత రూత్ ప్రభు

Vishal: శివ చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను : విశాల్

Virat Karna: చలికి శరీరం ఫ్రీజ్ అయింది - నాగసాధు మేకప్ కి ఆరు గంటలు పట్టేది.: విరాట్ కర్ణ

Brahmanandam: హ్యాంగ్‌మెన్ లాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం :డా. బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments