Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ మీ 5ఏ ఫోన్లపై బంపర్ ఆఫర్.. ఓన్లీ ఇండియన్ కస్టమర్లకే...

చైనా మొబైల్ దిగ్గజం షియోమీ తమ సరికొత్త మొబైల్‌ "5ఏ"ను భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఏకకాలంలో 50 లక్షల మొబైల్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (08:33 IST)
చైనా మొబైల్ దిగ్గజం షియోమీ తమ సరికొత్త మొబైల్‌ "5ఏ"ను భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఏకకాలంలో 50 లక్షల మొబైల్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భారతీయ మొబైల్ కొనుగోలుదార్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
2జీబీ, 3జీబీ వేరియంట్లలో దీన్నిమార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ ఫోన్లలో 2జీబీ/16జీబీ ఫోన్ ధర రూ.5,999గా నిర్ణయించింది. 3జీబీ/32జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.6,999గా నిర్ణయించింది. ఈ ధరలపై స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీ చరిత్రలోనే షియోమీ ఇండియన్ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ఇవ్వనుంది. 
 
ఈ బంపర్ ఆఫర్ కేవలం తొలి 50 లక్షల ఫోన్లపై మాత్రమే ఉంటుంది. మొదటి 50 లక్షల మంది కస్టమర్లలో మీరూవుంటే వెయ్యి రూపాయల డిస్కొంట్‌తో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత ధర కంపెనీ ప్రకటించినట్లుగానే ఉంటుంది. ఎంఐ కస్టమర్లకు బహుమతి రూపంలో రూ.500 కోట్లు ఇవ్వటం ఇదే ప్రథమం.
 
కాగా, ఈ ఫోన్ ఈనెల ఏడో తేదీనుంచి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది. డార్క్‌ గ్రే, గోల్డ్‌, రోజ్ కలర్స్‌లో ఈ ఫోన్స్ లభించనున్నాయి. 'దేశ్ కా స్మార్ట్ ఫోన్' పేరుతో రెడ్ మీ 5ఏ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే, ఐదు అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ నోగట్‌, ఎంఐయుఐ 9 వెర్షన్‌, 2జీబీ ర్యామ్‌/ 16జీబీ స్టోరేజ్‌, 3జీబీ/32జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు ఎక్స్ పెండబుల్, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3000ఎంఏహెస్ బ్యాటరీ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్‌ను తయారు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments