Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 అంగుళాల టీవీ కేవలం రూ.17 వేలు మాత్రమే...

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (18:41 IST)
భారతీయ టీవీ మార్కెట్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టిస్తున్న చైనాకు చెందిన షియోమీ... తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. 40 అంగుళాల టీవీని కేవలం రూ.17,999కే అందివ్వనుంది. ఈ మోడల్‌తోపాటు మరో మూడు మోడళ్ళను కూడా భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
 
ఐటీ సిటీ బెంగుళూరులో జరిగిన స్మార్ట్ లైవింగ్ కార్యక్రమంలో షియోమీ ఎంఐ టీవీ 4x65 అంగుళాలు, ఎంఐ 4x43 అంగుళాలు, ఎంఐ టీవీ 4x50 అంగుళాలు, ఎంఐ టీవీ 4ఎ అంగుళాల టీవీలు ఉన్నాయి. వీటిలో 4x65 అంగుళాల టీవీనే అతిపెద్దతి. అలాగే, 34.2 శాతం ఎంఐ టీవీ మోడళ్లను భారత్‌లో ఆఫ్‌లైన్ ద్వారా విక్రయించినట్టు షియోమీ వెల్లడించింది. 
 
కాగా, ఎంఐ టీవీ 4x65 అంగుళాల టీవీ ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.54,999కే అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ టీవీ 4x43 అంగుళాల టీవీ ధర రూ.24,999 కాగా, 40 అంగుళాల టీవీ ధర రూ.17,999 మాత్రమే. 50 అంగుళాల టీవీని రూ.29,999కే అందుబాటులో ఉంచింది. 
 
అమెజాన్, ఎంఐ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. అన్ని టీవీలు ఈ నెల 29న అర్థరాత్రి నుంచి విక్రయానికి సిద్ధంగా ఉంచనుంది. అయితే, 65 అంగుళాల టీవీని మాత్రం 29 నుంచి ప్రీ ఆర్డర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments