Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్‌కు చెక్.. మైక్రోసాఫ్ట్, టెన్సెంట్‌, ఇబేలతో చేతులు కలిపిన ఫ్లిప్ కార్ట్..

దేశీయ ఇ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. గట్టిపోటీనిస్తున్న ప్రత్యర్థి సంస్థ అమెజాన్‌కు చెక్ పెట్టే దిశగా భారీ నిధులను సేకరించింది. టెన్సెంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్ప్, ఇబే సంస్థల నుంచి ఫ్లిప్ కా

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (15:21 IST)
దేశీయ ఇ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. గట్టిపోటీనిస్తున్న ప్రత్యర్థి సంస్థ అమెజాన్‌కు చెక్ పెట్టే దిశగా భారీ నిధులను సేకరించింది. టెన్సెంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్ప్, ఇబే సంస్థల నుంచి ఫ్లిప్ కార్ట్ భారీగా 1.4 బిలియన్ డాలర్ల మేరకు నిధులను సేకరించింది. 2015 సంవత్సరంలో ఫ్లిప్ కార్ట్ విలువ 15 బిలియన్ డాలర్లుండగా, ప్రస్తుతం ఇది 23 శాతం క్షీణించి 11.6 బిలియన్ డాలర్లకు చేరింది. 
 
సంస్థ విలువ పడిపోతున్న నేపథ్యంలో కంపెనీ నిధుల సేకరణ వేటలో పడింది. అంచనాలకు అనుగుణంగానే మెగా డీల్ సాధించింది. ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఇబేను కూడా ఫ్లిప్ కార్టు కొనుగోలు చేసింది. ఇబే కూడా భారత్‌లోని వ్యాపారాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించడం ద్వారా భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టెన్సెంట్ వ్యూహాత్మకంగా భాగస్వామిగా, ఇబే ఫ్లిప్ కార్ట్‌లో స్వతంత్ర సంస్థగా కొనసాగనుంది. తద్వారా టెక్నాలజీ ద్వారా దేశీయ వాణిజ్య రంగ దిశను మార్చాలనే తమ అభిలాష ఈ నిధుల సేకరణ, ఒప్పందాల ద్వారా నెరవేరనుందని ఫ్లిఫ్ కార్ట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజా ఒప్పందంతో చైనాలో ఇంటర్నెట్‌కు సంబంధించిన సేవలను టెన్‌సెంట్ భారత్‌లో ఈ కామర్స్, చెల్లింపుల విధానంలో పాలు పంచుకునేందుకు అవకాశం లభించింది. ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు మంచి సర్వీస్‌ను అందించడంలో సాయం అందిస్తామని కంపెనీ అధినేత మార్టిన్ లా తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments