Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి మెసేజ్‌ను టచ్ చేస్తే మీ ఫోన్ అంతేసంగతులు..

అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ కొత్తకొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇప్పుడు యూజర్లకు కొత్త సమస్య ఎదురవుతోంది.

Webdunia
సోమవారం, 7 మే 2018 (14:25 IST)
అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ కొత్తకొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇప్పుడు యూజర్లకు కొత్త సమస్య ఎదురవుతోంది. అందులో బంతి ఆకారంలో వచ్చే ఏ ఎమోజీ ఉన్న మెసేజ్‌ను టచ్ చేసినా యూజర్ల వాట్సాప్ యాప్ హ్యాంగ్ అవుతున్నట్టు గుర్తించారు. మరికొంతమంది యూజవర్లకు ఏకంగా ఫోన్లే పనిచేయకుండా పోతున్నాయి.
 
అయితే నిజానికి ఇది వాట్సాప్‌లో వచ్చిన సమస్య కాదు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న బగ్ (సాఫ్ట్‌వేర్ లోపం) వల్లే సదరు బంతి లాంటి ఎమోజీలను టచ్ చేసినప్పుడు యాప్స్, ఫోన్లు హ్యాంగ్ అవుతున్నట్లు సాఫ్ట్‌వేర్ నిపుణులు గుర్తించారు. సదరు ఎమోజీలను వాట్సాప్‌లో కాకుండా ఏ ఇతర మెసేజింగ్ యాప్‌లో వాడినా పరిస్థితి ఇలాగే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
దీంతో అలాంటి ఎమోజీలు ఉన్న మెసేజ్‌లను ఓపెన్ చేయడం, ఆ ఎమోజీలను టచ్ చేయడం చేయవద్దని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా గూగుల్ టెక్ నిపుణులు నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments