Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్.. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ "ఇన్‌‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్" ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. దీని ద్వారా వినియోగదారులు డబ్బును పంపుకునే వీలు కలుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (10:53 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ "ఇన్‌‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్" ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. దీని ద్వారా వినియోగదారులు డబ్బును పంపుకునే వీలు కలుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. వాట్సాప్ పేమెంట్స్‌ను ఉపయోగించుకోవాలంటే... 'వాట్స్ యాప్ పేమెంట్స్ అండ్ బ్యాంక్ టెర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ'ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే, 'ఇన్ స్టంట్ మనీ ట్రాన్స్ ఫర్' ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఇదిలా ఉంటే.. రిలయన్స్ జియోకు చెందిన 4జీ ఫీచర్ ఫోన్. త్వరలో వినియోగదారులకు లభ్యం కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల చివరి వారంలో ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానుండగా సెప్టెంబర్ నెలలో యూజర్లకు ఈ ఫోన్లు లభించనున్నాయి. జియో 4జీ ఫీచర్ ఫోనులో వాట్సాప్‌ను ఎలాగైనా అందుబాటులోకి తేవాలని జియో నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జియో ప్రతినిధులు వాట్సాప్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. జియో 4జీ ఫీచర్ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ వెర్షన్‌ను క్రియేట్ చేసేందుకు గాను జియో వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సమాచారం 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments