Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్‌లో కొత్తగా ఆరు ఫీచర్లు

మెసేజింగ్ అప్లికేషన్‌లలో మొదటి స్థానంలో కొనసాగుతున్న వాట్సప్‌లో మరిన్ని అద్భుతమైన ఫీచర్లు ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్నట్లు మరియు త్వరలో వినియోగదారులకు అందించనున్నట్లు టెక్ వర్గాల సమాచారం.

Webdunia
సోమవారం, 24 జులై 2017 (13:08 IST)
మెసేజింగ్ అప్లికేషన్‌లలో మొదటి స్థానంలో కొనసాగుతున్న వాట్సప్‌లో మరిన్ని అద్భుతమైన ఫీచర్లు ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్నట్లు మరియు త్వరలో వినియోగదారులకు అందించనున్నట్లు టెక్ వర్గాల సమాచారం. మొదటిది యూట్యూబ్ ఇంటిగ్రేషన్, దీంతో మీరు యాప్ నుండి బయటికి రాకుండానే యూట్యూబ్ వీడియోలను వాట్సప్‌లోనే చూడవచ్చు. 
 
రెండోది యూపిఐ నగదు బదిలీ, దీనితో నగదు బదిలీ, బిల్లు చెల్లింపులు చేసుకోవచ్చు. మూడోది లైవ్ లొకేషన్ షేరింగ్, దీనితో మీ స్థానాన్ని కొద్ది నిమిషాల పాటు నిరవధికంగా షేర్ చేయవచ్చు, అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేందుకు కాస్త సమయం పట్టవచ్చు. తర్వాతది మెసేజ్ రీకాల్ సౌలభ్యం, మీరు ఎప్పుడైనా సందేశాలు, ఫోటోలు, వీడియోలను పొరపాటుగా పంపితే వాటిని రీకాల్ చేయవచ్చు. 
 
ఇంకా, పంపిన సందేశాన్ని ఎడిట్ చేసే సౌలభ్యం, దీనితో మీరు సందేశాలను పంపేసాక కూడా ఎడిట్ చేయవచ్చు, కానీ కొత్త సందేశాలను మాత్రమే ఎడిట్ చేయవచ్చు, పాతవి చేయలేరు. నంబర్ మారినప్పుడు మీ కాంటాక్ట్స్‌కి తెలియజేసే సౌలభ్యం, మీరు ఎప్పుడైనా వాట్సప్ నంబర్‌ను మారిస్తే, ఆటోమేటిక్‌గా మీ కాంటాక్ట్స్‌కి సమాచారం వెళ్తుంది. ఈ సరికొత్త ఫీచర్లతో వాట్సప్ ఎంతమేరకు వినియోగదారులను అలరించనుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments