Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్... త్వరలోనే సులభంగా ఫైల్ షేరింగ్ ఆప్షన్..

వరుణ్
బుధవారం, 24 జనవరి 2024 (09:23 IST)
ప్రముఖ ఇన్‌స్టా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. సులభంగా, వేగంగా ఫైల్‌ను షేరింగ్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు వాట్సాప్ తెలిపింది. గోప్యతతో భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను తీసుకునిరానున్నట్టు ఈ ఇన్‌స్టా మెసేజింగ్ యాప్ ప్రకటించింది. 
 
ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్లను అంస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' త్వరలోనే మరో కొత్త అప్‌డేట్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సాప్‌పై ఫైల్-షేరింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సమీపంలోని వ్యక్తులతో సులభంగా ఫైల్‌ను షేర్ చేసుకోవచ్చు. యూజర్లు ఫైల్స్‌ను స్వీకరించవచ్చు లేదా పంపించవచ్చు. ఇందుకోసం 'పీపుల్ నియర్ బై' అనే ఫీచర్ అందుబాటులోకి వస్తోందని, సమీపంలోని వ్యక్తులు సురక్షితంగా ఫైల్‌ను షేర్ చేసుకోవచ్చని 'వాబెటాఇన్ఫో' రిపోర్ట్ పేర్కొంది.
 
షేర్ రిక్వెస్టులు పొందడానికి, ఫైల్ మార్పిడి విషయంలో డివైజ్‌ని కదిలించాల్సి (షేక్) ఉంటుందని తెలుస్తున్నట్టు రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా ఫైల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్టు అవుతాయని, వాట్సాప్ చాట్‌కు వెలుపలకు, తెలియని ఇతర నెట్‌వర్క్‌కు ఫైల్స్ పంపించినా సురక్షితంగా ఉంటాయని వెల్లడించింది. 
 
సమీపంలోని వ్యక్తులతో ఫైళ్లను త్వరగా షేర్ చేయడానికి ఈ ఫీచర్ చాలా సులభంగా ఉంటుందని, వేగంగా, నేరుగా షేర్ చేసేందుకు ఇది అనువుగా ఉంటుందని వెల్లడించింది. ప్రతి ఫైల్ మార్పిడిలో గోప్యత, భద్రత ఉంటుందని, కాంటాక్ట్ లిస్ట్‌లోలేని వ్యక్తులకు షేర్ చేసినప్పుడు ఫోన్ నంబర్లు కనిపించవని రిపోర్ట్ తెలిపింది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారని, భవిష్యత్ ఈ అప్‌డేట్‌ను తీసుకురానుందని తెలిపింది.
 
మరోవైపు వాట్సాప్ ఐవోఎస్ యూజర్లు స్టిక్కర్లను క్రియేట్ చేయడానికి, వాటిని సవరించడానికి అవకాశం కల్పించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోటోలను స్టిక్కర్లుగా మార్చుకునే వీలుంది. ఇప్పటికే ఉన్న స్టిక్కర్లను కూడా నచ్చిన విధంగా సవరించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments