Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ న్యూ ఫీచర్ : ఇక నగదు బదిలీ కూడా...

తమ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. యూపీఐ సహాయంతో వాట్సాప్ ద్వారా నగదును బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఇప్పటికే ఈ విషయమై దేశీయ బ్యాంకులు, ఇతర సంస

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (12:47 IST)
తమ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. యూపీఐ సహాయంతో వాట్సాప్ ద్వారా నగదును బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఇప్పటికే ఈ విషయమై దేశీయ బ్యాంకులు, ఇతర సంస్థలతో చర్చలను ప్రారంభించింది. 
 
ఈ సదుపాయం అమల్లోకి వస్తే, యూపీఐ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగించి రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నగదు చెల్లింపులకు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్‌కు భారత్‌లో 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరి సంఖ్యను మరింత పెంచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది వాట్సాప్.  
 
కాగా, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు భార‌త్‌‌లో పోటీనిస్తోన్న హైక్ త‌మ వినియోగ‌దారుల ముందుకు మ‌రో ఫీచ‌ర్‌తో వ‌చ్చిన విషయం తెల్సిందే. తమ హైక్‌లో నగదు బ‌దిలీ, మొబైల్ బిల్స్ చెల్లించడం, రీఛార్జ్ చేసుకోవడం వంటి ఫీచ‌ర్లు తీసుకొచ్చిన‌ట్లు ఆ కంపెనీ ప్ర‌తినిధులు ఇటీవల ప్రకటించారు. 
 
యస్ బ్యాంక్ సాయంతో తాము వాలెట్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. యూపీఐ ద్వారా త‌మ యూజ‌ర్లు ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. భారత్‌లో వాట్స‌ప్ కూడా ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌నుంది. మెసేజింగ్ ప్లాట్ ఫామ్ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చిన తొలి యాప్ తమదేనని హైక్ ప్ర‌తినిధులు చెప్పారు. దీంతో వాట్సాప్ కూడా ఇదే తరహా ఫీచర్‌ను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ కేవలం భారతీయ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments