ప్రైవసీ పాలసీపై విమర్శలు.. వివరణ ఇచ్చిన వాట్సాప్

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (20:27 IST)
వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాట్సాప్‌ స్పందించింది. తాజా ప్రైవసీ పాలసీలో ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌కు సంబంధించిన విషయంలో ఎలాంటి మార్పులూ చేయలేదని వివరణ ఇచ్చింది. టర్మ్స్‌ ఆఫ్‌ సర్వీసెస్‌, ప్రైవసీ పాలసీని ఇటీవల వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను యూజర్లకు పంపిస్తోంది. 
 
వాట్సాప్‌ యూజర్ల డేటా ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలతో ఎలా పంచుకునేదీ వివరించింది. నవీకరించిన ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకారం తెలిపేందుకు ఫిబ్రవరి 8ని గడువుగా నిర్దేశించింది. గడువులోగా అంగీకరించకపోతే తమ యాప్‌ను వినియోగించలేరని వాట్సాప్‌ పేర్కొంది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌ అంశంపై వాట్సాప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగత సమాచారంపై ఆందోళన మొదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments