Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఫార్వర్డ్ మెసేజ్ పంపేటప్పుడు జాగ్రత్త సుమా..?

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మరో అద్భుత ఫీచర్‌తో ముందుకొచ్చింది. యూజర్లకు పదే పదే చిరాకు తెప్పిస్తున్న ఫార్వర్డెడ్‌ మెసేజ్‌‌ల గుట్టు విప్పనుంది. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని వివిధ గ్రూపుల్లో పోస్

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (12:54 IST)
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మరో అద్భుత ఫీచర్‌తో ముందుకొచ్చింది. యూజర్లకు పదే పదే చిరాకు తెప్పిస్తున్న ఫార్వర్డెడ్‌ మెసేజ్‌‌ల గుట్టు విప్పనుంది. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని వివిధ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్న వారి బాగోతం బయటపెట్టనుంది.


ఇకపై ఎవరైనా ఇలాంటి తప్పుడు మెసేజ్‌లు పంపినట్లైతే.. వారి సమాచారం మొత్తం తెలిసిపోతుంది. అందుచేత వాట్సాప్‌లో మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసేటప్పుడు ముందువెనకా ఆలోచించుకుని పంపాల్సి వుంటుందని వాట్సాప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ క్రమంలో తప్పుడు మెసేజ్  బారి నుంచి తప్పించడానికి ఫార్వర్డెడ్‌ లేబుల్‌ ఫీచర్‌‌ను లాంచ్‌ చేసింది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా ఫార్వర్డ్‌ మెసేజ్‌‌లకు, రెగ్యులర్‌ మెసేజ్‌లకు తేడా కనిపెట్టవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్‌ను యాక్సస్‌ చేసుకోవడానికి ఎలాంటి ప్రక్రియ అవసరం లేదు. కేవలం బీటా యూజర్లు తమ వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఆ మెసేజ్ ఎవరు పంపించారు.. ఎప్పుడు పంపించారు.. వారి ఫోన్ నెంబర్ మొత్తం వివరాలు తెలిసిపోతాయని వాట్సాప్ తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments