Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్.. స్టేటస్‌ ఇక బ్లాక్ అండ్ వైట్, రంగుల్లోనూ రాయొచ్చు...

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్ నమోదైంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ వినియోగ‌దారుల‌కు వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ అప్ డేట్ ద్వారా స్టేటస్‌ను ఇకపై రంగుల్లో రాయొచ్

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (11:32 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్ నమోదైంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ వినియోగ‌దారుల‌కు వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ అప్ డేట్ ద్వారా స్టేటస్‌ను ఇకపై రంగుల్లో రాయొచ్చు. స‌రిగ్గా ఇలాంటి అప్‌డేట్‌నే గ‌తేడాది ఫేస్‌బుక్ ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇదే తరహాలో వాట్సాప్ కూడా స్టేట‌స్ అప్‌డేట్‌లో రంగుల్లో రాయ‌డం, బ్యాక్‌గ్రౌండ్‌లో న‌చ్చిన రంగును పెట్టుకునే స‌దుపాయాన్ని కల్పిస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అలాగే అక్ష‌రాల‌ను వివిధ ఫాంట్ల‌లో రాసుకునే అవ‌కాశాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ సంస్థ పేర్కొంది. 
 
అలాగే స్టేట‌స్‌లో వెబ్ లింక్‌ల‌ను పెట్టుకునే అవ‌కాశం కూడా క‌ల్పించింది. వాట్సాప్ వీ2.17.50 ద్వారా ఐఫోన్‌లో బోల్డ్, ఇటాలిక్, స్ట్రైక్ థ్రూ టెక్ట్స్‌లను పొందే వెసులుబాటుంది. అనుకున్న పదాన్ని టైప్ చేయాలనుకుంటే రెండక్షరాలు టైప్ చేస్తే మిగిలిన పదం ఎంచుకునే సౌకర్యం వాట్సాప్‌లో ఇప్పటికే పొందుపరచడమైంది. తాజాగా ఈ రంగుల్లో స్టేటస్ రాసే ఆప్షన్ నెటిజన్లకు ఎంతగానో నచ్చుతుందని సంస్థ పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments