వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక పాస్‌వర్డ్ అక్కర్లేదు.. ఫింగర్ ప్రింట్‌ చాలు (video)

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (12:19 IST)
వాట్సాప్ పాస్‌వర్డ్ ఇక ఇతరులకు తెలిసినా పర్లేదు. ఇకపై ఇతరులు వాట్సాప్ మెసేజ్‌లు ఇక చూడటం కుదరదు. స్మార్ట్ ఫోన్లకు ఇంటర్నెట్ ఎలా అత్యవసరం అయ్యిందో.. అలాగే స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ కూడా కంపల్సరీ అయ్యింది. పలు కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ అప్లికేషన్ కొనుగోలు చేసిన నేపథ్యంలో, కొత్త కొత్త ఫీచర్లతో వాట్సాప్‌ను మెరుగులు దిద్దుతోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో గత జనవరి నెల వాట్సాప్ సంస్థ కీలకమైన ప్రకటనను చేసింది. ఇందులో కస్టమర్లకు ఫింగర్ ప్రింట్ ద్వారా వాట్సాప్ యాప్‌లోకి ప్రవేశించే ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుందని తెలిపింది. ఈ క్రమంలో అప్‌డేట్ చేయబడిన వాట్సాప్ యాప్‌లోని అకౌంట్ అప్లికేషన్‌లో ప్రైవసీ ఆప్లికేషన్‌ను క్లిక్ చేస్తే ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ వుంది. దీన్ని ఆన్ చేస్తే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. 
 
కస్టమర్లు తమ ఫింగర్ ప్రింట్‌ను ఇవ్వడం ద్వారా వాట్సాప్ లాక్ అవుతుంది. దీని ప్రకారం వాట్సాప్‌ను ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్ మాత్రమే అవసరం అవుతుంది. ఈ కొత్త ఫీచర్‌ను కస్టమర్లు తమ వాట్సాప్ లాక్‌గా ఉపయోగించుకోవచ్చు. తద్వారా పాస్ట్ వర్డ్ అవసరం వుండదని వాట్సాప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు-9 గ్రాండ్ ఫినాలే- ట్రెండ్స్‌లో తనుజ.. బీట్ చేస్తోన్న ఆ ఇద్దరు..?

Rakul Preet Singh: బాహుబలి వంటి సినిమా చేయాలని నా కోరిక : రకుల్ ప్రీత్ సింగ్

Jin review: ఎంటర్ టైన్ చేస్తూ, భయపెట్టేలా జిన్ చిత్రం - జిన్ రివ్యూ

ది రాజా సాబ్ సాంగ్ రిలీజ్.. నిధి అగర్వాల్‌కు ఇక్కట్లు.. సుమోటోగా కేసు (video)

Sri Charan: వాయిస్‌తోనే సౌండ్స్‌ను ఇచ్చాను, అందరూ ఎంజాయ్ చేస్తారు : శ్రీ చరణ్ పాకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments