Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం!

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (19:16 IST)
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గత యేడాది ఏకంగా 71 లక్షల మందికి చెందిన భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని యూజర్ సేఫ్టీ రిపోర్టులో పేర్కొంది. నకిలీ వార్తల వ్యాప్తి, యూజర్స్ నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగా 71 లక్షల ఖాతాలపై చర్యలు చేపట్టినట్టు తెలిపింది. వీటిలో 19 లక్షల ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, సంస్థ నిబంధనలను అతిక్రమించిన ఖాతాలపై చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. 
 
మరోవైపు, నవంబరు నెల యూజర్ల నుంచి 8,841 వినతులు వచ్చాయని, వాటిలో స్పామ్ ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదుు, ఖాతాలపై నిషేధం, ప్రొడక్ట్ సపోర్టు వంటివి ఉన్నాయని తెలిపింది. యూజర్లు ఫిర్యాదులు చేసిన ఖాతాలపై యూజర్ సేఫ్టీ రిపోర్టు ఆధారంగా వాట్సాప్‌లోని కృత్తిమమేథ ఆధారిత సాంకేతిక వ్యవస్థ చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తించిన తొలగించినట్టు పేర్కొంది. 
 
హైకోర్టులోనూ బెడిసికొట్టిన రాంగోపాల్ వర్మ "వ్యూహం" 
 
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం "వ్యూహం". వైకాపా నేత, నిరంజన్ రెడ్డి నిర్మాత. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే, తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. పైగా, సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌పై స్టే విధించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత హైకోర్డు డివిజన్ బెంచ్‌లో మరో పిటిషన్ వేశారు. తాజా పిటిషన్‌లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు. సినిమా విడుదల కాకపోవడం వల్ల తమకు కోట్లాది రూపాయల మేరకు నష్టపోయినట్టు తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచన చేసింది. 
 
సుప్రీంకోర్టులో ఆదానీకి భారీ ఊరట.. సిట్ దర్యాప్తునకు నో 
 
ఆదానీ గ్రూపు అధిపతి గౌతమ్ ఆదానీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. హిండెన్ బర్గ్ వివాదంలో ప్రత్యేక దర్యాప్తు సిట్ విచారణకు నో చెప్పింది. అదేసమయంలో సెబీ విచారణకు పచ్చజెండా ఊపింది. సెబీ దర్యాప్తుపై విశ్వాసం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పైగా, మీడియా రిపోర్టులపై ఆధారపడలేమని వ్యాఖ్యానించింది. అలాగే, వివాదంపై మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సెబీకి షరతు విధించింది. 
 
హిండెన్ బర్గ్ వివాదంలో అదానీ గ్రూపుకను క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. సెబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సెబీ దర్యాప్తుపై విశ్వాసం ప్రకటించిన అపెక్స్ కోర్టు.. సిట్ దర్యాప్తు అక్కర్లేదని పేర్కొంది. కేసు బదిలీకి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. హిండెన్ బర్గ్ నివేదికపై మిగతా దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో మీడియా రిపోర్టులపై ఆధారపడలేమని వ్యాఖ్యానించింది. 
 
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ తీర్పును వెలువరించింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ కెపెనీ గత యేడాది అదానీ గ్రూపుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్థిక అవకతవకలు పాల్పడినట్టు ఓ నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక దేశంలో పెను దుమారాన్ని రేపింది. దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ విచారణ చేపట్టింది. అయితే, ఈ అంశంపై సెబీ విచారణ సరిపోదని, సిట్ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుధీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం