Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో కొత్త పీచర్.. ఇకపై లింకులతో వీడియో కాల్స్

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (09:16 IST)
ప్రముఖ సోషల్ మెజేసింగ్ యాప్ వాట్పాస్‌లో ఈ వారం మరికొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి లింకులతో వీడియో కాల్స్ లేదా ఫోన్ కాల్స్ చేసుకునే వెసులుబాటు లభించనుంది. 
 
ఇక నుంచి వాట్సాప్‌లో వీడియో, వాయిస్‌ కాల్‌ల కోసం ఇతరులను ఆహ్వానించేందుకు ప్రత్యేక లింక్‌లను ఉపయోగించుకోవచ్చు. లింక్‌పై క్లిక్‌ చేసిన వెంటనే కాల్‌లో చేరేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. 
 
వాట్సప్‌లోని 'కాల్‌' సెక్షన్‌లోకి వెళ్లి లింక్‌ను సృష్టించొచ్చు. అయితే, ఇందుకోసం వాట్సాప్ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వాట్సప్‌ మాతృసంస్థ 'మెటా' సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సోమవారం ఫేస్‌బుక్‌ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, వాట్సప్‌లో ఒకేసారి 32 మంది గ్రూప్‌ వీడియోకాల్‌ మాట్లాడుకునేందుకూ వీలు కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత ప్రయోగ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఇవి త్వరలోనే సానుకూల ఫలితాలు లభిస్తాయని భావిస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments