Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీ బేసిక్స్‌కు రెడ్ సిగ్నల్: జుకర్ బర్గ్‌కు షాక్.. కార్తీక రెడ్డి ఎవరు.. రాజీనామా ఎందుకు చేశారు?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (10:20 IST)
ఫ్రీ బేసిక్స్‌కు భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. భారత నెటిజన్లను చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ఫేస్ బుక్ చీఫ్ జుకెర్ బర్గ్ ఫ్రీ బేసిక్స్‌ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విధానానికి రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో షాక్ తిన్న జుకెర్ బర్గ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఫేస్ బుక్ ఇండియా చీఫ్‌గా పనిచేస్తున్న కార్తీక రెడ్డితో ఆ పదవికి రాజీనామా చేయించారు. దీంతో త్వరలోనే ఆమె అమెరికాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలివెళ్లనున్నారు. 
 
భారత్‌లో ఫేస్ బుక్ విస్తరణలో కార్తీక రెడ్డి పాత్రే కీలకం. వేలల్లో ఉన్న భారత ఫేస్ బుక్ వినియోగదారుల సంఖ్యను ఆమె లక్షల సంఖ్యలోకి తీసుకెళ్లారు. తత్ఫలితంగా దేశంలో ఒక్క ఫేస్ బుక్ మాత్రమే కాక సోషల్ మీడియా శరవేగంగా దూసుకెళ్లింది. తాజాగా ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్‌కు భారత్‌లో ద్వారాలు మూసుకుపోవడంతో ఇక లాభం లేదనుకున్న జుకెర్ బర్గ్, సత్తా కలిగిన కార్తీక రెడ్డిని అమెరికా తీసుకెళ్లిపోవడానికే మొగ్గుచూపారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించే దిశగా జుకర్ బర్గ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments