Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:43 IST)
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు  ఈ విషయాన్నిలోక్ సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 
 
తద్వారా ఇకపై ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో కూడా తెలుసుకునే వీలు ఉంటుందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. కాగా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎప్పటికప్పుడు బోగస్ కార్డులు బటయపడుతూనే ఉన్నాయి.. మరోవైపు.. తమ ఓటు గల్లంతు అయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు.. ఎన్నికలకు వచ్చిన ప్రతీసారి ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిగా మారింది. 
 
ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగస్‌ కార్డులను ఈసీ నియంత్రించలేకపోతోంది. అయితే, బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇక ఈరోజు కేంద్రమంత్రి ప్రకటనను తర్వాత ఆ వైపుగా కేంద్రం దృష్టి సారించిందని అర్ధమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments