Webdunia - Bharat's app for daily news and videos

Install App

''వొడాఫోన్ సఖి'' ద్వారా మహిళలు ఇక ఫోన్ నెంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు..

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని వొడాఫోన్ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ''వొడాఫోన్ సఖి'' ప్లాన్‌తో ఇక ప్రైవేటుగా రీఛార్జ్ చేసుకునే సౌకర్యాన్ని వొడాఫోన్ కల్పించింది. తద్వారా ఇక నుంచి మహిళలు రీఛార్జ

Webdunia
శనివారం, 15 జులై 2017 (15:32 IST)
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని వొడాఫోన్ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ''వొడాఫోన్ సఖి'' ప్లాన్‌తో ఇక ప్రైవేటుగా రీఛార్జ్ చేసుకునే సౌకర్యాన్ని వొడాఫోన్ కల్పించింది. తద్వారా ఇక నుంచి మహిళలు రీఛార్జ్ కోసం రిటైలర్లకు తమ ఫోన్ నెంబర్లను చెప్పాల్సిన పనివుండదు. దీంతో పాటు ప్రత్యేకంగా మహిళల కోసం రూ.52, రూ.78, రూ.99 రీఛార్జీ ప్యాకులను వొడాఫోన్ ప్రకటించింది. 
 
కాగా మహిళలు రీఛార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రైవేట్ అని 12604కి మెసేజ్ ఇస్తే ఒక వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఈ నెంబరును 24 గంటల్లోపు ఏదైనా రిటైల్ షాపులో చెప్తే చాలు. మీ నెంబర్ బహిర్గతం కాకుండా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యూపీ (పశ్చిమ), ఉత్తరాఖంఢ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్‌ను త్వరలో దేశవ్యాప్తం చేయనున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. 
 
వొడాఫోన్ సఖి ఆఫర్ రూ.52 నుంచి ప్రారంభం అవుతుంది. రూ.52లకు రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజుల వ్యాలిడిటీతో 42 నిమిషాల టాక్ టైమ్ 50ఎంబీ 2జీ, 3జీ డేటా లభిస్తుంది. అలాగే రూ.78, రూ.99లకు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అదే 30 రోజుల వ్యాలీడిటీతో 62 నిమిషాల టాక్ టైమ్ 50 ఎంబీ, 79 నిమిషాల టాక్ టైమ్‌తో 50 ఎంబీని పొందవచ్చును.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments