ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.399కే ఆరు నెలల పాటు వినియోగించుకునేలా 90 జీబీ 4జీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్
ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.399కే ఆరు నెలల పాటు వినియోగించుకునేలా 90 జీబీ 4జీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్ కూడా చేసుకోవచ్చని తెలిపింది.
ఇటీవల టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన టారిఫ్ ఆఫర్లను సవరించిన విషయం తెల్సిందే. అయితే, వొడాఫోన్ మాత్రం ఏకంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
రూ.399తో రీచార్జ్ చేసుకునే వినియోగదారులు తమ 90జీబీ 4జీ డేటాను అవసరమైతే ఒక్క రోజులోనే వినియోగించుకునే వెసులుబాటు కూడా ఉందని, లేదంటే ఆరు నెలలపాటు వినియోగించుకోవచ్చని వివరించింది. అంటే ఈ ఆఫర్‌లో ఒక జీబీ రూ.4.43కే వినియోగదారులకు లభిస్తుందని పేర్కొంది.
కాగా, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు కూడా రూ.399 రీచార్జ్ ప్లాన్‌లు అందిస్తున్నా వాటి కాలపరిమితి, డేటా బాగా తక్కువగా ఉంది. జియో రోజుకు 1జీబీ చొప్పున 70 రోజుల కాలవ్యవధితో 84 జీబీ అందిస్తుండగా, ఎయిర్‌టెల్ రోజుకు ఒక జీబీ చొప్పున 70 రోజులపాటు 70జీబీ డేటాను అందిస్తోంది. వోడాఫోన్ మాత్రం వీటికి ధీటుగా 90జీబీతో పాటు.. 180 రోజులు ఇవ్వనుంది.