Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ధర రూ.9499 మాత్రమే...

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (09:42 IST)
వివో కంపెనీ బడ్జెట్ స్మార్ట్ ఫోనును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వివో వై18టీ పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర కూడా రూ.పది వేలకు తక్కువగానే ఉండటం గమనార్హం. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, యూనిసాక్ టీ612 చిప్సెట్, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ఆకర్షణీయమైన ఫీచర్లను కంపెనీ అందించింది.
 
వివో వై18టీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,499గా ఉంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ రంగులలో ఈ ఫోన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. వివో ఇండియా వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌పై కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్జచ్ ఓఎస్ 14పై పనిచేస్తుంది. 720x1612 పిక్సెల్స్ రిజల్యూషన్తో 6.56 అంగుళాల హెచ్+ ఎల్సీడీ డిస్‌ప్లే, 840 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ర్యామ్‌ను 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే ప్రత్యేక ఫీచర్ ఉంది. మైక్రో ఎల్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు.
 
కెమెరా విషయానికి వస్తే వివో వై18టీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50-ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.2, ఎంఎఫ్ రేడియో, జీపీఎస్, గ్లోనాస్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments