మొబైల్ మార్కెట్‌లో రసవత్తరమైన పోటీ నెలకొంది. షియోమీ, వీవో, ఒప్పో వంటి చైనా మొబైల్‌లు భారత మార్కెట్‌ను ఇప్పటికే దున్నేస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న వినియోగదారుల అవసరాల కారణంగా ఈ సంస్థలు సరికొత్త మోడల్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఆ క్రమంలో వివో సంస్థ మరో మోడల్‌ని ప్రవేశపెట్టనుంది.
వివో ఎక్స్27 పేరుతో సరికొత్త ఫోన్‌ను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. దీని వివరాలను ఇంకా వెల్లడించలేదు. వినియోగదారులను బాగా ఆకట్టుకునే రీతిలో ఇందులో సరికొత్త ఫీచర్లను అందించనున్నారు.