అంతా కరోనా మాయ.. లావాదేవీలన్నీ డిజిటల్ మయం..

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (13:57 IST)
నోట్ల రద్దు తర్వాత క్రమంగా డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. అనేక రకాల యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు జరిగిపోతున్నాయి. గల్లీలో ఉండే చిన్న కొట్టు నుంచి ఫైవ్ స్టార్‌ హోటల్‌ వరకు అంతా డిజిటల్ మయమైపోయింది. బ్యాంకులో డబ్బు ఉంటే చాలు.. జేబులో స్మార్ట్‌ ఫోన్‌ పెట్టుకుని ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. 
 
కరోనా కారణంగా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేసే వాల్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరెన్సీతోనూ కరోనా వ్యాప్తికి అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా సాగడంతో.. డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
 
ఈ క్రమంలోనే దేశంలో యూపీఐ ద్వారా అక్టోబర్‌ నాటికి రెండు వందల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని తెలియవచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో ఇది నూట 14 కోట్లుగా ఉంది. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో భారీగా పెరుగుల నమోదైనట్టు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్వీట్‌ చేశారు. 
 
గత ఏడాదితో పోలిస్తే లావాదేవీలు 80 శాతం పెరిగాయి. అలాగే, లావాదేవీల విలువలో 101 శాతం పెరుగుదల నమోదైంది. లక్షా 91 వేల 359 కోట్ల రూపాయల నుంచి 3 లక్షల 86 వేల 106 కోట్ల రూపాయలకు పెరిగినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments