Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 10 అంకెలు కాదు.. 11 అంకెల మొబైల్ నెంబర్‌: ట్రాయ్

Webdunia
శనివారం, 30 మే 2020 (10:03 IST)
దేశంలో 10 అంకెల మొబైల్ నెంబర్ స్థానంలో 11 అంకెల మొబైల్ నెంబర్‌ను వినియోగించాలని.. టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ప్రతిపాదించింది.  పలువురితో చర్చల అనంతరం కొన్ని సిఫార్సులను, ప్రతిపాదనలన విడుదల చేసింది. ఇకపై ల్యాండ్‌లైన్ల నుంచి మొబైల్స్‌కు కాల్‌ చేస్తే వాటి నంబర్ల ముందు జీరో కలపాలని ట్రాయ్‌ పేర్కొంది.
 
అయితే, ల్యాండ్‌లైన్‌ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్‌ నుంచి ల్యాండ్‌ లైన్‌కు, మొబైల్‌ నుంచి మొబైల్‌కు కాల్స్‌ చేస్తే సున్నా అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం డాంగిల్స్‌కు పదెంకల నంబర్లే ఉన్నాయి. ఇకపై వాటిని 13 అంకెలకు పెంచాలని ట్రాయ్‌ సిఫార్సు చేసింది.
 
అలాగే ముఖ్యంగా దేశంలో ప్రస్తుతం 10 అంకెల మొబైల్‌ నంబర్లు ఉన్నాయి. ఇకపై 11 అంకెల మొబైల్‌ నంబర్లను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా కొత్తగా నెంబర్ల సంఖ్యను పెంచుకోవచ్చని ట్రాయ్‌ పేర్కొంది. మొబైల్‌ నంబర్లకు ముందు 9 అంకెను కలపడం ద్వారా అవి 11 అవుతాయి. ఫలితంగా టెలికాం ఆపరేటర్లు కొత్తగా మరో 1000 కోట్ల మొబైల్‌ నంబర్లను వాడుకలోకి తీసుకురావచ్చని ట్రాయ్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments