Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tecno Phantom V ఫ్లిప్ 5G: అక్టోబర్ 1 నుంచి అమేజాన్‌లో..

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (09:45 IST)
Tecno Phantom V Flip 5G
టెక్నో పాంథం ఫ్లిఫ్ స్టైల్‌లో 5జీ స్మార్ట్ ఫోనును విడుదల చేసింది. దీని పేరు టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 5జీ. ఇతర ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే.. తమ గ్యాడ్జెట్ చాలా ప్రత్యేకమైనదని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ గాడ్జెట్ వృత్తాకార కవర్ స్క్రీన్‌ను ది ప్లానెట్ అంటారు. కెమెరా మాడ్యూల్ రూపకల్పన ఆస్టరాయిడ్ బెల్ట్‌ను గుర్తుకు తెస్తుంది. ఫోన్ కేస్‌లో ప్రీమియం లిచ్-ప్యాటర్న్ క్లాసిక్ వేగన్ లెదర్‌ని ఉపయోగించాు.
 
ఈ గాడ్జెట్ లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 2 లక్షలకు పైగా మడతలను తట్టుకునేలా రూపొందించబడిందని టెక్నో ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
Tecno Phantom V ఫ్లిప్ 64MP ప్రైమరీ, 12MP అల్ట్రా వైడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ విషయానికొస్తే, ఈ డివైస్ 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రీకామ్ సిస్టమ్‌తో అద్భుతమైన ఫోటోలను తీయవచ్చు.
 
ఈ మోడల్‌లో MediaTek Dimension 8050 5G చిప్‌సెట్ ఉంది. ఇది 8GB RAM, 256GB నిల్వను కలిగి ఉంది. కానీ ఈ గాడ్జెట్ 4000 mAh బ్యాటరీని మాత్రమే పొందుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 
 
అలాగే వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 5జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. Tecno ఫాంటమ్ V ఫ్లిప్ 5G భారతదేశంలో ప్రారంభ ధర రూ. 49,999. ఐకానిక్ బ్లాక్ మరియు మిస్టిక్ డాన్ కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి ఈ మోడల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇతర దేశాలలో కూడా విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments