Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు గంటల్లోనే 9లక్షల కోట్లు నష్టపోయిన ఫేస్‌బుక్‌.. ఎలాగంటే?

గంటల వ్యవధిలోనే 21శాతం నష్టపోయింది.. సోషల్ మీడియా అగ్రగామి ఫేస్‌బుక్. గురువారం ఫేస్‌బుక్ షేర్లు పడిపోయాయి. ఫలితంగా 130 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. అంటే రెండు గంటల్లోనే 9లక్షల కోట్లు నష్టపోయింది. దీంత

Webdunia
గురువారం, 26 జులై 2018 (14:12 IST)
గంటల వ్యవధిలోనే 21శాతం నష్టపోయింది.. సోషల్ మీడియా అగ్రగామి ఫేస్‌బుక్. గురువారం ఫేస్‌బుక్ షేర్లు పడిపోయాయి. ఫలితంగా 130 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. అంటే రెండు గంటల్లోనే 9లక్షల కోట్లు నష్టపోయింది. దీంతో ఫేస్‌బుక్ సీఈవో జుకెర్ బర్గ్ సంపద 16.8 బిలియన్ డాలర్లు తరిగిపోయింది. ఇలా జుకర్ బర్గ్ సంపదనలో ఐదో వంతు కోల్పోవడం ఇదే తొలిసారి. 
 
గతంలో కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కామ్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఫేస్‌‌బుక్ లాభాలు ఏడాదిలో 47 శాతం నుంచి 44 శాతానికి పడిపోయాయి. గత మూడేళ్లలో ఫేస్‌‌బుక్‌‌కు ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫేస్‌‌బుక్ లాభం 510 కోట్ల డాలర్లుగా నమోదైంది. అంటే షేరుకు 1.74 డాలర్ల మేర లాభాలు సాధించింది. రోజువారీ ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య 147 కోట్లుగా ఉంది.
 
తాజాగా ఫేస్‌‌బుక్ షేర్లు గురువారం మరింత పతనమైతే బ్లూమ్‌ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌‌లో జుకెర్‌ బర్గ్ మూడు నుంచి ఆరోస్థానానికి పడిపోతారని.. అదే జరిగితే జుకెర్‌ బర్గ్ సంపద ఏడు వేల కోట్ల డాలర్ల కంటే తక్కువకు చేరుతుందని రిపోర్ట్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments