రూ.3,999లతో ఎలైట్ 4 జీ ఫోనును విడుదల చేసిన స్వైప్ టెక్నాలజీస్

భారత మార్కెట్లోకి స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రూ.3,999లతో అన్ని ఫీచర్లతో స్వైప్ ఎలైట్ 4జీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగ‌దారులు కొనుగోలు చేస

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (13:34 IST)
భారత మార్కెట్లోకి స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రూ.3,999లతో అన్ని ఫీచర్లతో స్వైప్ ఎలైట్ 4జీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగ‌దారులు కొనుగోలు చేసుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ బుజ్ కార్డ్ హోల్డర్స్‌తో కొనుగోలు చేస్తే ఐదు శాతం తగ్గింపును కూడా అందుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయెల్ సిమ్ కలిగి వుంటుంది. బ్లాక్, గ్రే, గోల్డ్ రంగుల్లో ఈ పోన్ లభిస్తుంది. 
 
భారత్‌లో 4జీ డేటా వినియోగదారుల సంఖ్య పెరిగిపోతున్న వేళ.. రూ.4వేలకే 4జీ ఫీచర్లతో ఫోన్‌ను విడుదల చేశామని స్వైప్ టెక్నాలజీస్ సీఈఓ శ్రీపాల్ గాంధీ తెలిపారు. భారత మార్కెట్లోకి ఎలైట్ 4జీ ఫోనును విడుదల చేయడం ద్వారా తమ వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవచ్చునని శ్రీపాల్ అన్నారు.
 
ఫీచర్ల సంగతికి వస్తే.. 
1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌, 
5 ఇంచెస్‌ హెచ్‌డీ ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 
8 మెగా పిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 
5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, 
64 జీబీ వరకు విస్తరణ మెమరీ, 
3.5ఎంఎ ఆడియో జాక్‌ను ఈ ఫోను కలిగివుంటుందని స్వైప్ టెక్నాలజీ తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments