Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విగ్గీ గోకు ఆదిలోనే చిక్కు.. ఆ లింక్ క్లిక్ చేస్తే రూ.95వేలు మటాష్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (13:07 IST)
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ ''స్విగ్గీ గో'' ఆదిలోనే చిక్కుల్లో పడింది. ఈ సర్వీసు సెప్టెంబర్ 4న ఈ సర్వీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే.

స్విగ్గీ గో పేరుతో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంటి వచ్చిన ఓ లింకుపై క్లిక్ చేసిన మహిళకు పెద్ద షాక్ తగిలింది. లింకుపై క్లిక్ చేసిన మహిళ వివరాలు.. యూపీఐ పిన్ వివరాలు ఇచ్చింది. దీంతో ఆమె అకౌంట్ నుంచి రూ.95వేలు మాయమయ్యాయి. ఇది గ్రహించిన మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. అపర్ణా టక్కర్ సూరీ అనే మహిళ బెంగళూరులోని ఇంద్రానగర్‌లో నివాసముంటోంది. తన స్మార్ట్‌ఫోన్‌ను అమ్మాలన్న ఉద్దేశంతో ఓఎల్‌ఎక్స్‌లో పెట్టింది. ఫోను కొందామని భావించిన మొహ్మద్ బిలాల్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. దీంతో స్విగ్గీ గో యాప్ ద్వారా తన ఫోనును మొహ్మద్ బిలాల్‌కు పంపింది. ఫోను అందిన తర్వాత బిలాల్ ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపుతానని చెప్పాడు. 
 
ఇక ఉదయం 8:45 గంటలకు డెలివరీ బాయ్ వచ్చి అపర్ణ దగ్గర ఫోనును తీసుకున్నాడు. ఉదయం పదకొండు గంటలకు బిలాల్ అపర్ణకు ఫోన్ చేసి డెలివరీ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని, తన చేతికి ఫోన్ ఇంకా అందలేదన్న సమాచారం చేరవేశాడు. డెలివరీ బాయ్‌కు ఫోన్ చేయగా ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని ఫోను ఆఫీసులోనే ఉందని అపర్ణకు చెప్పాడు.
 
ఇక స్విగ్గీ గో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేద్దామని తప్పుడు నెంబర్ డయల్ చేసింది. దీంతో అవతల వ్యక్తి ఫోన్ ఎత్తి ఆమె సమస్యగురించి తెలుసకున్నాడు. వెంటనే ఓ లింకు పంపుతామని చెప్పి దానిపై క్లిక్ చేసి మూడు రూపాయలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సిందిగా కోరాడు. ఇది నమ్మిన అపర్ణ లింక్‌పై క్లిక్ చేసింది వెంటనే ఆమె బ్యాంకు వివరాలు, యూపీఐ పిన్ నెంబర్‌లు ఐదు రకాల ఫోన్‌ నెంబర్లకు పంపాలని తెలిపాడు. 
 
వెంటనే అపర్ణ తన వివరాలన్నీ ఐదు ఫోన్ నెంబర్లకు పంపింది. అంతే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆమె ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. రూ.95వేలు బదిలీ అయినట్లు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది అపర్ణ. వెంటనే బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
అపర్ణను ఎవరో మోసం చేశారని.. స్విగ్గీకి ఆమె ఫోన్ చేయలేదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇదొక ఆన్‌లైన్ మోసమని, ప్రముఖ బ్రాండ్‌ కంపెనీల పేర్లతో తప్పుడు లింకులు సృష్టించి డబ్బులు హైటెక్ పద్దతిలో కొందరు ఆన్‌లైన్ మోసగాళ్లు కొట్టేస్తున్నారని స్విగ్గీ ప్రతినిధి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments