Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌న్న‌డిగుల‌కు మ‌రో అవ‌మానం.. రాష్ట్ర జెండాతో ముద్రించిన బికినీని..?

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (15:54 IST)
క‌న్న‌డిగుల‌కు మ‌రో అవ‌మానం జ‌రిగింది. ఇటీవ‌లే ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జం గూగుల్.. భార‌త‌దేశంలో అతి వికారమైన‌ భాష‌గా క‌న్న‌డను పేర్కొన్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్ కెనడా.. క‌న్న‌డ రాష్ట్ర జెండాతో ముద్రించిన బికినీని అమ్మ‌కానికి పెట్టింది.
 
దీనిపై క‌ర్ణాట‌క సాంస్కృతిక శాఖ‌ మంత్రి అర‌వింద్ లింబాలి మండిప‌డ్డారు. అమెజాన్ కెనడాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త‌మ మనోభావాలను దెబ్బతీసినందుకు వెంట‌నే క్షమాపణ చెప్పాలని అమేజాన్‌ను ఆయ‌న డిమాండ్ చేశారు. 
 
ఇది కన్నడిగుల ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన విష‌య‌మ‌ని, ఇలాంటివాటిని తాము స‌హించ‌బోమ‌ని అన్నారు. ఇటీవ‌లే గూగుల్ త‌మ భాష‌ను అవ‌మానించింద‌ని మండిప‌డ్డారు. ఇక‌నైనా బ‌హుళ‌జాతి సంస్థ‌లు ఇలాంటివి పున‌రావృతం కాకుండా చూడాల‌ని కోరారు. దీంతో అమేజాన్‌ను బ్యాన్ చేయాలని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు. అమేజాన్ కన్నడిగులను అవమానించిందని మండిపడుతున్నారు. 
 
ఇకపోతే.. ఇటీవల చెత్త భాష ఏది అని సెర్చ్ చేస్తే కన్నడ అని గూగుల్‌లో చూపడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. కన్నడ భాషను తక్కువ చేసిన గూగుల్‌ ఉదంతం మరువకముందే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ అమెజాన్‌ కూడా కన్నడను అవమానించింది. పసుపు, ఎరుపు రంగులతో ఉండే కన్నడ పతాకాన్ని ముద్రించిన లోదుస్తుల్ని అమెజాన్‌ వెబ్‌సైట్, యాప్‌లో విక్రయిస్తున్నారు. 
 
పైగా ఆ దుస్తుల మీద జాతీయ జెండాపై ఉండే అశోక చక్రాన్ని సైతం ముద్రించి పైత్యం చాటుకున్నారు. ఇది కన్నడిగులను అమెజాన్‌ కంపెనీ అవమానించడమేనని పలు కన్నడ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అమెజాన్‌ తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments