Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్ కార్ట్‌తో డీల్ కుదర్లేదు.. ఒంటరిగానే స్నాప్‌డీల్ వ్యాపారం.. ఉద్యోగాల కోత..

ఫ్లిఫ్ కార్ట్‌తో విలీన ఒప్పందం కుదరకపోవడంతో వ్యాపారంలో ఒంటరిగానే ముందుకు సాగాలని స్నాప్ డీల్ నిర్ణయించుకుంది. విలీనానికి ససేమిరా అన్నది. విలీన ఒప్పందం పూర్తికాకుండానే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సంస్థ మళ్

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (11:15 IST)
ఫ్లిఫ్ కార్ట్‌తో విలీన ఒప్పందం కుదరకపోవడంతో వ్యాపారంలో ఒంటరిగానే ముందుకు సాగాలని స్నాప్ డీల్ నిర్ణయించుకుంది. విలీనానికి ససేమిరా అన్నది. విలీన ఒప్పందం పూర్తికాకుండానే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సంస్థ మళ్లీ తిరిగి వ్యాపారంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు వ్యయాలను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించనుందని తెలుస్తోంది. 
 
సుమారు 80 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని స్నాప్ డీల్ నిర్ణయించుకుంది. స్నాప్ డీల్‌లో ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. స్నాప్ డీల్ తాజా నిర్ణయంతో దాదాపు వెయ్యిమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది. తొలగించాల్సిన ఉద్యోగుల జాబితా తయారు చేయాలని ఆయా విభాగాధిపతులకు మేనేజ్ మెంట్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments