Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామ్‌సంగ్‌ ఫోనుపై రూ.15 వేల డిస్కౌంట్

ఠాగూర్
ఆదివారం, 7 జనవరి 2024 (18:01 IST)
టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ రెండు వారాల్లో (జనవరి 17) ప్రారంభంకానుంది. తన ఎస్‌24 సిరీస్‌ ఫోన్లను ఈ సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ లాంచ్‌ కాకముందే శాంసంగ్‌ తన పాత సిరీస్ ఎస్‌23 మోడల్‌ ధరల్ని తగ్గించింది.
 
గెలాక్సీ ఎస్‌23 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.74,999కాగా.. రూ.10వేల డిస్కౌంట్‌తో రూ.64,999కే అందిస్తోంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.79,999గా పేర్కొనగా.. ప్రస్తుతం రూ.69,999కే విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5.1తో తీసుకొచ్చారు. 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 12 ఎంపీ కెమెరా, 3900mAh బ్యాటరీ అమర్చారు.
 
గెలాక్సీ ఎస్‌23 ప్లస్‌ 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ.94,999గా కంపెనీ పేర్కొనగా.. తగ్గింపుతో రూ.84,999కే అందిస్తోంది. ఇక 8జీబీ+512 జీబీ వేరియంట్‌ మార్కెట్‌ ధర రూ.1,04,999కాగా.. రూ.94,999కే కొనుగోలు చేయొచ్చని శాంసంగ్‌ పేర్కొంది. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌, 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 12 ఎంపీ కెమెరా, 4700ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
 
శాంసంగ్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్లలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లతో ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ప్రస్తుతం కార్డు ఆఫర్లేవీ అందుబాటులో లేవు. మరికొన్ని వేదికల్లో ఎక్‌ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 
 
యాక్సిస్‌ బ్యాంక్‌ సిగ్నేచర్‌ క్రెడిట్‌ కార్డు సాయంతో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.2,500 తగ్గింపు ఉంటుంది. అదే యాక్సిస్‌ బ్యాంక్‌ ఇన్ఫినిటీ క్రెడిట్‌కార్డు ద్వారా అయితే రూ.5 వేల డిస్కౌంట్‌ పొందొచ్చు. అంటే మొత్తం రూ.15వేల వరకూ తగ్గింపుతో ఈ ఫోన్లు కొనుగోలు చేయొచ్చన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments