Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5వేలకే శాంసంగ్ ఫోన్.. ఇండోనేషియా ఆవిష్కరణ.. భారత్‌లో..?

Webdunia
గురువారం, 23 జులై 2020 (18:01 IST)
Samsung Galaxy A01
శాంసంగ్ నుంచి రూ.5వేలకే స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ01 కోర్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ ఫోన్ మొదట ఇండోనేషియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర భారత్‌లో సుమారు రూ.5,500 నుంచి ప్రారంభం కానుంది. బ్లూ, బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 
 
ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని శాంసంగ్ తెలపలేదు. 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద సుమారు రూ.5,000కే దీన్ని విక్రయించనున్నారు.
 
ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 17 గంటల 4జీ టాక్ టైం, 14 గంటల ఇంటర్నెట్ యూసేజ్, 11 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ లభించనుంది. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. వైఫై, బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, జీపీఎస్, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. 
 
శాంసంగ్ గెలాక్సీ ఏ01కోర్ స్పెసిఫికేషన్లు ఇవే:
డిస్ ప్లే: 5.3 అంగుళాల హెచ్ డీ+ టీఎఫ్ టీ ఎల్సీడీ డిస్ ప్లే
కోర్ ప్రాసెసర్: 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
ర్యామ్, స్టోరేజ్: 1 జీబీ ర్యామ్, 32 జీబీ వరకు స్టోరేజ్
స్టోరేజ్‌ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
 
కెమెరా :
వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా
ముందువైపు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: సామర్థ్యం 3000 ఎంఏహెచ్
 
ఇందులో 1 జీబీ ర్యామ్ ఉండనుంది. 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించనున్నారు. 16 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ రెండు ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. 3000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments