Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ఐఫోన్‌పై డిస్కౌంట్.. నవంబర్ 30 వరకు మాత్రమే...

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ గత నెలలో ఐఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ.57 వేలుగా నిర్ణయించింది. గూగుల్ పిక్సెల్ బ్రాండులో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్‌కు పోటీ

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (16:25 IST)
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ గత నెలలో ఐఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ.57 వేలుగా నిర్ణయించింది. గూగుల్ పిక్సెల్ బ్రాండులో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్‌కు పోటీగా గూగుల్ ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. 
 
అయితే, ఈ ఫోన్ కొనుగోలు చేయదలచుకున్న వారికి ఓ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈనెల 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రముఖ సెర్చింజన్ ప్రవేశపెట్టిన ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ.7,000 వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. 
 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు ఈ డిస్కౌంట్ ఆఫర్ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అదే యాక్సిస్ బ్యాంకు కార్డు వినియోగదారులకైతే రూ.5,000 క్యాష్ బ్యాక్‌ను కంపెనీ అందించనుంది. వీటితో ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్‌లో గూగుల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను గూగుల్ ప్రకటించింది. వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ పై రూ.26,000వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది.
 
ఈ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు...
5 అంగుళాల ఫుల్ హెచ్ డీ రిజుల్యూషన్ అమోలెడ్ డిస్ ప్లే, 2770 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 12.3 ఎంపీ రియర్ కెమెరా, 4జీబీ ర్యామ్, 32 జీబీ, 128 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ ఆప్షన్స్, 1.6 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్ తదితర అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments