Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఎఫెక్ట్ : రూ.29తో నెలంతా ఇంటర్నెట్.. ఎయిర్‌టెల్

రిలయన్స్ జియో సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో టెలికామ్ కంపెనీల మధ్య ధరల యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే జియో పోటీని తట్టుకునేందుకు వీలుగా ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే బిబి2

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (05:15 IST)
రిలయన్స్ జియో సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో టెలికామ్ కంపెనీల మధ్య ధరల యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే జియో పోటీని తట్టుకునేందుకు వీలుగా ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే బిబి249 పేరుతో అపరిమిత ఇంటర్నెట్ ప్యాక్‌ను ప్రకటించింది. ఇపుడు తాజాగా టెలికామ్ దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా ఇదే దారిలోకి వచ్చింది. నెలంతా ఇంటర్నెట్ పేరుతో రూ.29 విలువ గల ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. 30 రోజుల కాలపరిమితి గల ఈ ప్యాక్ కింద 75 ఎంబీ 2జీ/3జీ/4జీ డేటా అందుకోవచ్చు. అందుబాటు ధరలో ఎంట్రీ లెవెల్ ప్యాక్‌తో ఎక్కువ రోజులు ఆన్‌లైన్‌లో ఉండాలని కోరుకునే వారి కోసం దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ తెలిపింది.
 
మరోవైపు.. గత నెలలో ఎయిర్‌టెల్ కంపెనీ డేటా చార్జీలను గణనీయంగా తగ్గించిన విషయం తెల్సిందే. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మెగా సేవర్ ప్యాక్ కింద యేడాది పాటు 1జీబీ 4జీ డేటాను రూ.51 చొప్పున అందిస్తామని ప్రకటించింది. అయితే ఈ ప్యాక్ కోసం ముందుగా వారు రూ.1,498 చెల్లించి 1జీబీ 4జీ/3జీ డేటా ప్లాన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏడాదిపాటు ఎన్నిసార్లయినా రూ.51 చెల్లించి 1జీబీ 3జీ/4జీ డేటాను రీఛార్జ్ చేయించుకోవచ్చు. అలాగే రూ.748 చెల్లించి 1జీబీ 4జీ/3జీ డేటా ప్యాక్ తీసుకున్న వారు... ఆ తర్వాత 6 నెలల పాటు రూ.99 చొప్పున ఎన్నిసార్లయినా 1జీబీ 3జీ/4జీ డేటా ప్యాక్‌లు తీసుకునేలా ఆఫర్లు ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments