Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోటీపడుతున్న టెలికాం సంస్థలు.. 365 రోజులతో కొత్త ప్లాన్స్

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (19:45 IST)
కరోనా నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇంటర్‌నెట్ వాడకం బాగా పెరిగింది. దీంతో టెలికాం సంస్థలు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ కొత్త ఆఫర్స్ ప్రకటించాయి. 365 రోజుల ప్లాన్లతో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ముందుకొచ్చాయి. 
 
ఇందులో భాగంగా ఎయిర్ టెల్ రూ. 2498 ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ కింద 365 రోజుల కాలపరిమితితో ప్రతిరోజు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్ అందించనున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. 
 
అలాగే రిలయన్స్ జియో రూ. 2399 ప్లాన్‌ను ప్రకటించింది. 365 రోజుల కాల పరిమితితో రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత ఫోన్ కాల్స్ అందించనున్నట్లు జియో ప్రకటించింది. 
 
అలాగే వొడాఫోన్ రూ. 2399 ప్లాన్‌తో 365 రోజుల కాల పరిమితి, ప్రతిరోజు 1.5జీబీ డేటా,100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని వొడాఫోన్ స్పష్టం చేసింది.
 
మరోవైపు ఎయిర్ టెల్ కొత్త 4జీ డేటా వౌచర్‌ను ప్రవేశపెట్టింది. రూ.251 ప్లాన్ ద్వారా 50జీబీ హై-స్పీడ్ డేటాను అందించనుంది. అయితే రూ.98 డేటా ప్లాన్‌ను ఎయిర్ టెల్ తొలగించింది. ఈ డేటా ప్లాన్ కింద 12జీబీ హైస్పీడ్ డేటాను వినియోగదారులకు అందించేది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments