Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌: డిసెంబర్ 25వరకు గడువు పొడిగింపు

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. మొదటి నుంచి వివిధ ఆఫర్లతో కోట్లాది వినియోగదారులను తమవైపు తిప్పుకున్న జియో, ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ క్యాష

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (18:13 IST)
దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. మొదటి నుంచి వివిధ ఆఫర్లతో కోట్లాది వినియోగదారులను తమవైపు తిప్పుకున్న జియో, ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ ఆఫర్ గడువును తొలుత నవంబర్ 25వ తేదీగా నిర్ణయించింది. 
 
ప్రస్తుతం వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో ఆ గడువును డిసెంబర్ 15దాకా పొడిగించింది. ఈ గడువును జియో మళ్లీ పొడిగించింది. దీనిప్రకారం డిసెంబర్ 25వ తేదీ వరకు జియో వినియోగదారులు ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.

ఈ ఆఫర్ కింద వినియోగదారులు రూ.399.. ఆపైన విలువ గల ప్లాన్‌ను జియో యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.400 విలువ గల ఎనిమిది వౌచర్లు లభిస్తాయని ప్రకటించింది. వీటిని యాత్రా, రిలయన్స్ ట్రెండ్స్ సైట్లలో వినియోగించుకోవచ్చు. ఇలా మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో కస్టమర్లకు ఆఫర్ చేసింది. 
 
ఈ ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద జియో నవంబరులో రూ.2,599 వరకు క్యాష్‌ బ్యాక్‌ను ప్రకటించింది. జియో ప్రైమ్ ఖాతాదారులకు మాత్రం రూ.399కి రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌‌లు, రోజుకు 1జీబీ, 70 రోజులకు 4జీ డేటాను పొందే అవకాశాన్ని కల్పించింది

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments