Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.303 రీఛార్జ్‌ చేయండి 3 నెలల పాటు డేటా ఫ్రీగా పొందండి.. జియో ప్రకటన.. ఫ్రైమ్ కొనసాగింపు

ఉచిత డేటా పేరుతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన ఫ్రైమ్ ఆఫర్ గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ గడువులోపు రూ.99 చెల్లించి ప్రైమ్‌ కస్టమర్లుగా మారొచ్చునని కంపెనీ తెలిపింది. అంతేక

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (09:17 IST)
ఉచిత డేటా పేరుతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన ఫ్రైమ్ ఆఫర్ గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ గడువులోపు రూ.99 చెల్లించి ప్రైమ్‌ కస్టమర్లుగా మారొచ్చునని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ప్రైమ్‌ కస్టమర్లకు మరో ఊహించని ఆఫర్‌ను ప్రకటించింది. ఏప్రిల్‌ 15లోపు 303 రూపాయలు లేదా అంతకు మించిన ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే మూడు నెలల పాటు ఉచిత (కాంప్లిమెంటరీ) సర్వీసులను అందిస్తామని జియో వెల్లడించింది. 
 
ఇప్పటికే 7.2కోట్ల మంది కస్టమర్లు జియో ఫ్రైమ్‌కు మారారని జియో తెలిపింది. ఉచిత సర్వీసు నుంచి పెయిడ్‌ సర్వీసుకు ఇంత భారీ స్థాయిలో కస్టమర్లు మారిన సందర్భాలు టెలికాం రంగ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ కనిపించ లేదని జియో పేర్కొంది.
 
మరోవైపు.. జియో ప్రైమ్‌ సభ్యులకు ‘సమ్మర్‌ సర్‌ప్రైజ్‌’ను ఇవ్వాలని నిర్ణయించినట్టు రిలయన్స్‌ జియో అధినేత ముకేష్‌ అంబానీ పేర్కొన్నారు. అంతేకాకుండా తొలిసారిగా రీచార్జ్‌ చేసుకున్న వారికి మూడు నెలల పాటు ఉచిత సర్వీసులను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా 303 రూపాయల రీచార్జ్‌తో రోజు 1జిబి డేటాను ఆర్‌జియో 28 రోజుల గడువుతో అందిస్తోంది. వాయిస్‌ కాల్స్‌ ఉచితమని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments