Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో మరో బంపర్ ఆఫర్.. రూ.99తో మరో యేడాది ఫ్రీ....

దేశ టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఇపుడు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంవత్సరం పాటు రూ.99లకే రిలయన్స్ జియోలో ప్రాథమిక సభ్యత్వం అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (15:03 IST)
దేశ టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఇపుడు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంవత్సరం పాటు రూ.99లకే రిలయన్స్ జియోలో ప్రాథమిక సభ్యత్వం అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు.
 
మార్చి 31వ తేదీలోపు జియో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి.. ఆ తర్వాత రూ.99కే ప్రాథమిక సభ్యుత్వం అందిస్తామన్నారు. ప్రాథమిక సభ్యులుగా ఉన్నవారికి ప్రస్తుతం వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తున్న ఆఫర్లను మరో యేడాది పాటు యధాతథంగా పొందవచ్చునని ప్రకటించారు. 
 
ఇకపోతే.. జియో మొబైల్ వినియోగదారుల సంఖ్య పది కోట్లకు చేరిందని తెలిపారు. గత 170 రోజులుగా సెక‌నుకు ఏడుగురు క‌స్ట‌మ‌ర్లు జియో యూజ‌ర్లుగా మారార‌ని చెప్పారు. జియో నెట్‌వ‌ర్క్‌లో ప్ర‌తి రోజూ 5.5 కోట్ల గంట‌ల వీడియోను చూస్తున్నార‌ని అన్నారు. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా దేశంలోని 99 శాతం జ‌నాభాను జియో క‌వ‌ర్ చేస్తుంద‌ని ముఖేష్ అంబానీ ధీమా వ్య‌క్తం చేశారు
 
కేవలం జనవరి నెలలోనే జియో కస్టమర్లు 100 కోట్ల జీబీ డేటా వినిగించుకున్నట్టు వెల్లడించారు. మొబైల్ డాటా వినియోగంలో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇకపోతే... ఏప్రిల్ 1 నుంచి జియో కస్టమర్ల నుంచి చార్జీల వసూలు ప్రారంభిస్తామన్నారు. డేటా అన్నది డిజిటల్ లైఫ్‌కి ఆక్సిజన్ లాంటిదని పునరుద్ఘాటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అడివి శేష్‌ G2 లో నటించడం ఆనందంగా, సవాలుగా వుందంటున్న వామికా గబ్బి

Kanguva: ఆస్కార్ రేసులో కంగువ.. సూర్య సినిమాపై మళ్లీ ట్రోల్స్

1000 వర్డ్స్ చిత్రం చూశాక కన్నీళ్లు వచ్చాయి :రేణూ దేశాయ్

రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు వేయొద్దు : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments