రిలయన్స్ జియో కొత్త ఫోనులో వాట్సప్ ఉండదట.. షాకైన కస్టమర్లు..

రిలయన్స్ జియో నుంచి వచ్చే నెలలోనే 'జియో 4జీ ఫీచర్‌ ఫోన్' మార్కెట్‌లోకి విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ ఫీచర్ ఫోన్లో వాట్సప్‌ను ఉపయోగించే వీలుండదని తెలుసుకున్న వినియోగదారులు షాకవుతున్నారు. ఈ కొత్త మొబైల్

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (16:13 IST)
రిలయన్స్ జియో నుంచి వచ్చే నెలలోనే 'జియో 4జీ ఫీచర్‌ ఫోన్' మార్కెట్‌లోకి విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ ఫీచర్ ఫోన్లో వాట్సప్‌ను ఉపయోగించే వీలుండదని తెలుసుకున్న వినియోగదారులు షాకవుతున్నారు. ఈ కొత్త మొబైల్ కోసం ఆగస్టు 24 నుంచి బుకింగ్ ప్రారంభం అవుతోంది. సెప్టెంబర్ నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ మొబైల్ ఫోనును ఉచితంగా ఇవ్వనున్నప్పటికీ రూ.1500 డిపాజిట్ చేయాల్సి వుంది. 
 
మూడేళ్ల పిమ్మట ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జియో ఫోను ఫీచర్ల గురించి వివరాలు వెలుగులోకి వచ్చాయి. 4జీ మొబైల్ ఫోన్ అయినప్పటికీ.. అందులో వాట్సాప్ ఉపయోగించే వీలుండదని తెలుస్తోంది. జియో చాట్ యాప్ ద్వారా మాత్రమే ఛాట్ చేయడం కుదురుతుందని తెలిసింది. దీంతో వినియోగదారులు షాక్ తిన్నారు.
 
ప్రస్తుత హైటెక్నాలజీ ఇంటర్నెట్ ప్రపంచంలో వాట్సాప్ లేని ఫోన్‌ను జియో విడుదల చేయడం క్రేజ్‌ను సంపాదించుకుంటుందా లేదా అనేది తెలియాల్సి వుంది. ఫోన్లలోనే సోషల్ మీడియాను తెగ వాడేసే వారున్నారు. ఈ పరిస్థితుల్లో వాట్సాప్ ఉపయోగానికి వీలుండని ఫోనును జియో విడుదల చేయడంపై కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments