'ఉచితం' పొడిగిస్తున్నామంటూ మెసేజ్ రాలేదా? డోంట్‌వర్రీ అంటున్న రిలయన్స్ జియో

రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్ కింద మొబైల్ సేవలను పొందుతున్న ఖాతాదారులందరికీ ఆ సంస్థ సమాచారం తెలిపింది. వెల్‌కమ్ ఆఫర్ కింద జియో కస్టమర్లుగా ఉన్నప్పటికీ.. "మార్చి 31 వరకూ ఉచిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకోవచ

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (13:56 IST)
రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్ కింద మొబైల్ సేవలను పొందుతున్న ఖాతాదారులందరికీ ఆ సంస్థ సమాచారం తెలిపింది. వెల్‌కమ్ ఆఫర్ కింద జియో కస్టమర్లుగా ఉన్నప్పటికీ.. "మార్చి 31 వరకూ ఉచిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు" అంటూ మీకు రిలయన్స్ జియో నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మెసేజ్ రాలేదా? ఉచిత ఆఫర్‌పై మెసేజ్ రాకున్నా ఆఫర్ కొనసాగుతుందని ఆందోళన చెందుతున్న కస్టమర్లకు రిలయన్స్ జియో స్పష్టంచేసింది. 
 
ఈ మేరకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా)కు వివరణ ఇస్తూ, తామందించిన ప్రమోషనల్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ వేరువేరని స్పష్టం చేసింది. అందువల్ల డిసెంబర్ 31 వరకూ ఇచ్చిన ఉచిత ఆఫర్‌కు తాజా ఆఫర్ కొనసాగింపు కాదని తేల్చి చెప్పింది. మొదటి ఆఫర్‌లో డేటా కోసం రీచార్జ్ చేసుకునే వెసులుబాటు లేదనీ, కానీ.. న్యూ ఇయర్ ఆఫర్ కింద డేటా కోసం రీచార్జ్ చేసుకునే సౌలభ్యం ఉందని ట్రాయ్‌కు వివరించింది. 
 
అయితే, వెల్‌కమ్ ఆఫర్ కింద ఉన్న జియో వినియోగదారులందరికీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొంతమందికి మెసేజ్ వెళ్లలేదని, ఈ విషయంలో కంగారు పడనక్కర్లేదనీ, మరో 90 రోజులు ఉచిత సేవలను అందుకోవచ్చని, వినియోగించిన డేటాకు బిల్లు పంపుతున్నట్టు వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments