Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు వంతపాడుతున్న ట్రాయ్.. నష్టానికి నష్టం.. నెట్‌వర్క్‌కు దెబ్బ: ఎయిర్‌టెల్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోపై టెలికామ్ సంస్థలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఉచితం పేరిట జియో ఇష్టానుసారం వ్యవహరిస్తుందని భారతీ ఎయిర్‌టెల్ ఫైర్ అయ్యింది. ఉచిత ఆఫ‌ర్‌తో ఇత‌ర

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (16:39 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోపై టెలికామ్ సంస్థలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఉచితం పేరిట జియో ఇష్టానుసారం వ్యవహరిస్తుందని భారతీ ఎయిర్‌టెల్ ఫైర్ అయ్యింది. ఉచిత ఆఫ‌ర్‌తో ఇత‌ర నెట్‌వ‌ర్క్ కంపెనీల న‌డ్డివిరుస్తున్న రిల‌య‌న్స్ జియోకు వ్య‌తిరేకంగా భార‌తీ ఎయిర్‌టెల్ ట్రైబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించింది. 
 
మూడు నెలల పాటు వెల్ కమ్ ఆఫర్ ముగిసిన తర్వాత కూడా ఉచిత ఆఫర్ కొనసాగింపుకు ఎలా అనుమతి ఇచ్చారని ట్రాయ్‌ని ఎయిర్‌టెల్ నిలదీసింది. ఈ మేర‌కు టెలికం వివాదాల ప‌రిష్కార ట్రైబ్యున‌ల్‌ కు ఫిర్యాదు చేసింది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న రిల‌య‌న్స్ జియోకు ట్రాయ్ వంతపాడుతోందని ఎయిర్‌టెల్ ఆరోపించింది. ట్రాయ్ ఆదేశాల ఉల్లంఘ‌న కార‌ణంగా తాము ప్ర‌తి రోజు న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని ఎయిర్‌టెల్ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ఉచిత కాల్స్ వ‌ల్ల పెరిగిన ట్రాఫిక్‌తో త‌మ నెట్‌వ‌ర్క్ దెబ్బ‌తింటోంద‌ని, అందుకే ఈ పిటిష‌న్ దాఖ‌లు చేయాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించింది. అంతేగాకుండా జియో ఉచిత వాయిస్‌, డేటా సేవ‌ల‌ను ఇక ముందు కొన‌సాగించ‌కుండా ఆదేశాలు జారీ చేయాల‌ని ట్రైబ్యున‌ల్‌ను కోరింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments