Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్‌తో ఫేస్‌బుక్‌కు లాభాలపంట.. ఎలా?

రిలయన్స్ జియో ఉచిత డేటాతో ఎవరెంత ప్రయోజనులయ్యారో కానీ.. ఉచిత డేటాతో ఫేస్‌బుక్‌ లాభాలను గడించింది. ఉచిత డేటా ఆఫర్లు ఫేస్‌బుక్‌ పాలిట వరంగా మారాయి. భారత్‌లో టెలికాం ఆపరేటర్లు పోటీలు పడి ఉచిత డేటా ఆఫర్లు

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (14:29 IST)
రిలయన్స్ జియో ఉచిత డేటాతో ఎవరెంత ప్రయోజనులయ్యారో కానీ.. ఉచిత డేటాతో ఫేస్‌బుక్‌ లాభాలను గడించింది. ఉచిత డేటా ఆఫర్లు ఫేస్‌బుక్‌ పాలిట వరంగా మారాయి. భారత్‌లో టెలికాం ఆపరేటర్లు పోటీలు పడి ఉచిత డేటా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ త్రైమాసికంలో సోషల్ మీడియాలో దిగ్గజమైన ఫేస్ బుక్ ఆదాయం గణనీయంగా పెరిగింది. 
 
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఫేస్ బుక్ ఆదాయం 51 శాతం మేర పెరిగి.. 8.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. డిసెంబర్‌ త్రైమాసికంలో ఫేస్‌బుక్‌ మొబైల్‌ ప్రకటనల రాబడి 53 శాతం పెరిగి 8.6 బిలియన్‌ డాలర్లకు చేరుకొంది. భారత్‌ వంటి దేశాల్లో థర్డ్‌పార్టీ ఉచిత డేటా ఆఫర్లతో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో స్పష్టమైన ప్రభావం కనిపించిందని ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో వెల్లడి చేసింది. భారత్‌ వంటి దేశాల్లో ఉచిత డేటా ఆఫర్ల వెల్లువతోనే ఇది సాధ్యమైందని ఫేస్‌బుక్‌ ముఖ్య ఆర్థిక అధికారి డేవిడ్‌ వెహ్నర్‌ స్పష్టం చేశారు.
 
ఫేస్‌బుక్‌కు 19 బిలియన్‌ యూజర్లు ఉండగా రోజుకు 1.2 బిలియన్ల మంది లాగిన్‌ అవుతున్నారు. ఇందులో 1.1 బిలియన్ల మంది మొబైల్‌ ద్వారానే ఫేస్‌బుక్‌ చూస్తున్నారని ఫేస్ బుక్ ప్రకటన ద్వారా తెలియజేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments